బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వానలు ముంచెత్తాయి. ఎటు తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యాయి. పలు నగరాలు నీట మునిగాయి. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు, అటు ఏపీలో విజయవాడ నగరం జల దిగ్బంధానికి గురయ్యాయి. ఊహించని ఈ విపత్తుతో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. తిండి, నీరు లేక బాధితులు అలమటిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వరద ఉధృతి తగ్గుముఖం పడుతుంది. ఓ వైపు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. వరద భాధితులకు అండగా నిలుస్తుంది సినీ ఇండస్ట్రీ. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, బన్నీ వాసు వంటి సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు భారీ ఎత్తున విరాళం ప్రకటించారు.
ఇప్పుడు టాలీవుడ్ బిగ్ స్టార్స్ డార్లింగ్ ప్రభాస్, అల్లు అర్జున్, సోనూ సూద్.. వరద బాధితులకు ఆదుకునేందుకు ముందకు వచ్చారు. యంగ్ రెబల్ స్టార్స్ రెండు కోట్లు ఇస్తున్నట్లు ఆయన టీం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే అల్లు అర్జున్ సైతం ఇరు రాష్ట్రాలకు కోటి రూపాయలు ఎనౌన్స్ చేశారు. ఇరు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి చెరో రూ. 50 లక్షలు అందజేయనున్నారు. అలాగే ఆపద కాలంలో నేనున్నా అంటూ ముందుకు వచ్చాడు సోనూసూద్. ఆయన కూడా చెరో కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. వరద బాధితులకు అండగా సినీ సెలబ్రిటీస్ పెద్ద యెత్తున ఆర్థిక సాయం ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విపత్కర కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న తమ అభిమాన నటుల్ని చూసి మురిసిపోవడంతో పాటు గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.
విపత్కర కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న తమ అభిమాన నటుల్ని చూసి మురిసిపోవడంతో పాటు గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.. వీరే కాకుండా సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఎంత ఇచ్చారంటే…ఆయ్ మూవీ నిర్మాత బన్నీ వాసు.. ఈ వారంలో తమ సినిమా కలెక్షన్లలో 25 శాతం వరద బాధితుల సహాయ నిధికి అందిస్తామని ప్రకటించారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కోటి రూపాయలు, బాలకృష్ణ కోటి రూపాయలు, మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, తారక్ కోటి రూపాయలు ప్రకటించారు. అంటే చెరో 50 లక్షలు తెలంగాణ, ఏపీ సీఎం సహాయనిధికి అందించనున్నారు. సిద్దు జొన్నలగడ్డ.. రూ. 15 లక్షల చొప్పున ఇరు తెలుగు రాష్ట్రాలకు మొత్తం రూ. 30 లక్షలు ప్రకటించారు. విశ్వక్ సేన్ రూ. 10 లక్షలు డొనేషన్ ఎనౌన్స్ చేశారు. అలాగే రాజకీయ నేతలు కూడా తమ విరాళాలను ప్రకటించారు.