AP Education: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇంటర్‌ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు..

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తీసుకురాబోతోంది.. ఇంటర్ విద్య లో కీలక మార్పులు వస్తాయి..

పాఠ్య పుస్తకాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.. ఇక మొదటి సంవత్సరం ఖచ్చితంగా పాస్ అవ్వాలన్న నిబంధనకు మినహాయింపు ఇవ్వబోతున్నారు. గత ఆరు నెలల నుంచి ఇంటర్ బోర్డ్ కు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి.. ఇంటర్ లో సంస్కరణలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం. ఈ నెల 26 వరకు వెబ్ సైట్ లో అభిప్రాయం చెప్పచ్చు అన్నారు ఏపీ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా..

గత కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డ్ లో సంస్కరణలు జరగలేదు.. ప్రస్తుతం నాలుగు సంస్కరణలు ప్రధానంగా ఉన్నాయి అన్నారు కృతికా శుక్లా.. గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు జరగలేదు.. ఇంటర్ విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరు అవుతారు.. వీరికి తగ్గట్టుగా కొత్త సిలబస్ తీసుకు రాబోతున్నాం అన్నారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ మార్పుపై దృష్టి పెట్టాం.. ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లీషు సిలబస్ మారుస్తున్నాం అన్నారు.. సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ ఈ సిలబస్‌పై దృష్టి పెట్టిందన్నారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ ఏదైనా అప్షన్ తీసుకునే అవకాశం విద్యార్థులకు ఉంది.. NCERT సిలబస్ వల్ల మాథ్స్.. కెమిస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న సిలబస్ బాగా తగ్గుతుందన్నారు.. CBSE సిలబస్ ప్రకారం ప్రస్తుతం మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు.. ఇంటర్ లో ఇక నుంచి ఇంటర్నల్ ప్రాక్టికల్ మర్క్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు ఈ ఇంటర్నల్ మార్కులు ఉంటాయి.. 20 మార్కులు ఇంటర్నల్ గా ఉంటాయని వెల్లడించారు ఏపీ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా.