పీఆర్సీ నివేదిక సమర్పించేలోపు ఉద్యోగులకు మధ్యంతర భృతిని చెల్లించాలి: ప్రభుత్వానికి ఏపీ ఎన్జీవో డిమాండ్

www.mannamweb.com


ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించాలి అని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళామని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల మీద దృష్టి సారిస్తుంది అని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు కెవీ.

శివారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఏపీ ఎన్జీవో హోమ్‌లో జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కెవీ శివారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగులకు రావలిసిన పెండింగు బకాయిలైన 6 విడతల కరువు భత్యం, పీఆర్సీ ఎరియర్స్‌ను చెల్లించాలని ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని కేవీ శివారెడ్డి అన్నారు.

చీకటి తొలగి వెలుగునుచూస్తున్నాం: శివారెడ్డి
కనీసం ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన కూడా చేయని పరిస్థితులు ఉండేదికాదని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి వెల్లడించారు. అటువంటి పరిస్థితుల నుండి ఉద్యోగుల ఆకాంక్ష మేరకు నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణం ప్రదర్శిస్తుందన్నారు. ఉద్యోగులకు చీకటి రోజులు తొలగిపోయి కొద్ది కొద్దిగా చీకటినుంచి వెలుగువైపు చూడగలుగుతున్నామని అన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల గురించి రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి తెలిపారు.

మధ్యంతర భృతిని చెల్లించాలి: శివారెడ్డి
ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి వెల్లడించారు. పీఆర్సీ కమిటీకి కమిషన్‌ను నియమించి నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళమని పీఆర్సీ నివేదిక సమర్పించేలోపు ఉద్యోగులకు మధ్యంతర భృతిని చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడంలో ఉద్యోగులు మరింత సహకరించి రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని శివారెడ్డి తెలిపారు.

ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధపెట్టాలి: పురుషోత్తం నాయుడు
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సంఘం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ పురుషోత్తమ నాయుడు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పట్ల శ్రద్ధ పెట్టాలన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి పటిష్టమైన నాయకత్వం కావాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఉండేదని కృష్ణా జిల్లా ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఉద్యోగుల బకాయిలను చెల్లింపుపై దృష్టి సారించే దృక్పధం ఉందన్నారు. ఉద్యోగులకు సంబంధించి బకాయిలతో పాటు ఏపీజిఎల్ ఐ, జిపిఫ్, సరెండర్ లీవ్ వంటి బిల్లుల చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ నెలాఖరికి ఖాళీ కానునున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి ఎ. విద్యాసాగర్‌ని ఎన్నుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట కోశాధికారి రంగారావు, రాష్ట్ర, జిల్లాల కార్యవర్గం సభ్యుు, జిల్లాలోని వివిధ తాలూకా యూనిట్లకు చెందిన అధ్యక్షా కార్యదర్శులు, ఈసీ మెంబర్లు పాల్గొన్నారు.