ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. జనవరి ఒకటో తేదీన సెలవు లేదని… ప్రకటన చేశారు. ఈ మేరకు…. అధికారులు కీలక ప్రకటన చేశారు. జనవరి ఒకటో తేదీన ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చేందుకు రెడీ అయింది.
దీంతో ప్రభుత్వ హాలిడే లేదని తెలుస్తోంది..
ఇక అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం… జనవరి ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు ఎలాంటి సెలవు ఉండదు. కాబట్టి కచ్చితంగా అందరూ విద్యాసంస్థలకు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది.
అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిఫరెంట్ నిర్ణయాన్ని తీసుకుంది. జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ హాలిడేగా ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో జనవరి ఒకటో తేదీన అన్ని విద్యాసంస్థల తో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడే ఉండనుంది. ఈ నేపథ్యంలో…. డిసెంబర్ 31 ఎంజాయ్ చేసిన వారు ఒకటో తేదీన కూడా… గుళ్ళు గోపురాలకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.