అమెజాన్‌లో సేల్‌.. తగ్గింపు ధరకే ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ల్యాప్‌టాప్‌

www.mannamweb.com


ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ల్యాప్‌టాప్‌ ను (Apple Macbook Air M1) ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.99,900 గా ఉండేది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో (Amazon) భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ సుమారు 18 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. ఇది 13.3 అంగుళాల లిక్విడ్‌ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది.

ప్రస్తుతం అమెజాన్‌లో ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ల్యాప్‌టాప్‌ 8GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.56,990 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ఆకట్టుకొనే డిజైన్‌ ను కలిగి ఉంది. ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. మరియు విద్యార్థులు సహా వివిధ రంగాల నిపుణులు సులభంగా ఉపయోగించుకొనేలా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ ను 2020 నవంబర్‌ లో లాంచ్‌ చేసింది. ఆ ఆపిల్‌ ల్యాప్‌టాప్‌ 13.3 అంగుళాల (2560*1600 పిక్సల్‌) లిక్విడ్‌ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. 400 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, బ్యాక్‌లిట్‌ కీబోర్డుతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ 8 కోర్‌ CPU M1 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఫలితంగా మెరుగైన పనితీరును అందిస్తుంది. వీడియో ఎడిటింగ్‌, ఫోటో ఎడిటింగ్‌ వంటి టాస్క్‌లను సులభంగా చేసుకొనేందుకు వీలుంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ 30W ఛార్జింగ్‌ సపోర్టుతో USB-C పోర్టును కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా 18 గంటలపాటు వినియోగించుకోవచ్చు. మరియు వీడియో కాల్స్ కోసం కెమెరాను కలిగి ఉంటుంది. ఈ మ్యాక్‌బుక్‌ ఎయిర్ M1 ల్యాప్‌టాప్‌ బరువు 1.29kg లుగా ఉంది.

ప్రస్తుతం ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ల్యాప్‌టాప్‌ భారత్‌ మార్కెట్‌ లో మూడు రంగుల్లో లభిస్తుంది. గోల్డ్‌, స్పేస్‌ గ్రే, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ ఫేస్‌ టైమ్‌ HD కెమెరా, టచ్‌ ఐడీ సెన్సార్‌, బ్యాక్‌ లిట్ కీబోర్డు వంటి ఫీచర్‌ లను కలిగి ఉంది. ఆపిల్‌ నుంచి అక్టోబర్‌ నెలలో ఆపిల్‌ ఐప్యాడ్‌ మిని విడుదల అయింది. పోర్టబుల్‌ డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఐప్యాడ్‌ A17 ప్రో చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. ఈ ఐప్యాడ్‌ ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఐ‌ప్యాడ్‌ 8.3 అంగుళాల లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్‌ పెన్సిల్‌ ప్రోను సపోర్టు చేస్తుంది. ఆపిల్‌ ఐప్యాడ్‌ వెనుక వైపు 12MP కెమెరాను అమర్చారు. అదే ముందు వైపు 12MP కెమెరాతో అందుబాటులో ఉంది. 128GB, 256GB, 512GB స్టోరేజీ వేరియంట్‌లలో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఐప్యాడ్‌ మిని 2024.. స్టార్‌లైట్‌, బ్లూ, పర్పుల్, స్పేస్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది.