APTWRS అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కామన్ ఎంట్రెన్స్ ద్వారా రాష్ట్రంలోని 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 5 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అవుతుంది.
రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ మేరకు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APTWREIS) నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ ప్రవేశాల కోసం అర్హులైన వారు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.ప్రతి జనరల్ ఎస్టీ గురుకుల పాఠశాలలో మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఈ 80 సీట్లను ఒక్కో సెక్షన్‌కు 40 మంది చొప్పున రెండు సెక్షన్లుగా విభజిస్తారు. మొత్తం సీట్లలో ఎస్టీలకు 78 శాతం సీట్లను కేటాయిస్తారు. మిగతా సీట్లను బీసీ, ఓసీ, ఎస్సీ విద్యార్థులతో భర్తీ చేస్తారు.
APTWREIS నోటిఫికేషన్ – ముఖ్య వివరాలు
- అడ్మిషన్ల నోటిఫికేషన్ -గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఆంధ్రప్రదేశ్
- ప్రవేశాలు – 5వ తరగతి
- గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,00,000 మించకూడదు.
- దరఖాస్తు విధానం – ఆన్ లైన్
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం – 5 ఫిబ్రవరి 2026
- దరఖాస్తులకు చివరి తేదీ – 28 ఫిబ్రవరి 2026
- హాల్ టికెట్ డౌన్లోడ్ – 10 మార్చి 2026
- ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ – 4 ఏప్రిల్ 2026
- ఎంపిక విధానం – రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు
- 4వ తరగతి స్థాయి సిలబస్‌తో మొత్తం 50 మార్కులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
- తెలుగు-10 మార్కులు, ఆంగ్లం-10 మార్కులు, మ్యాథ్స్-15 మార్కులు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి 15 మార్కులు ఉంటాయి.
- మెరిట్ జాబితా ప్రకటన – 29 ఏప్రిల్ 2026
- ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ – 09 మే 2026
- సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ – 25 మే 2026
- థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ – 10 జూన్ 2026
- అధికారిక వెబ్ సైట్ – https://aptwreis.apcfss.in/


































