ఎగ్జామ్ లేకుండానే నియామకాలు.. కొన్ని గంటలు మాత్రమే టైం

ర్బీఐలో హై ప్యాకేజ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశంలోని అత్యున్నత ఆర్థిక సంస్థలో పనిచేసే అవకాశం ఉండటంతో పాటు, ఎంపికైన వారికి నెలకు రూ.3 లక్షలకుపైగా జీతం లభించనుంది.


ఈ నియామకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై, జనవరి 6 వరకు కొనసాగనుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒప్పంద ప్రాతిపదికన 93 మంది నిపుణులను నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఇంటర్వ్యూల ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్ష లేకుండానే నిపుణులైన అభ్యర్థులను ఎంపిక చేయనుండటం విశేషం. ఈ పోస్టులు ఫుల్‌టైమ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

ఏఏ విభాగాల్లో ఖాళీలు..

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రిమి సైజ్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సూపర్‌విజన్ వంటి కీలక విభాగాల్లో మొత్తం 93 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల్ని బట్టి బీబీఏ, బీఎస్సీ, బీటెక్/బీఈ, ఎంబీఏ/పీజీడీఎం, ఎంసీఏ, సీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ, పీజీడీబీఏ వంటి అర్హతలతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండటం తప్పనిసరి.

ఏజ్ లిమిట్..

అభ్యర్థుల వయసు కనీసం 21 ఏళ్లు, గరిష్ఠంగా 62 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100 మాత్రమే చెల్లించాలి. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.3.10 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు జీతం లభించనుంది.

ఆర్బీఐలో నిపుణులుగా పనిచేయాలనుకునే వారికి ఇది అరుదైన అవకాశం అని చెప్పాలి. అర్హతలు కలిగిన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్‌, పోస్టుల వివరాలు, అప్లికేషన్ లింక్ కోసం ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.