పిల్లలకు ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో పాలు ఇస్తున్నారా.? వైద్యులు ఏమంటున్నారంటే

www.mannamweb.com


ప్రస్తుతం ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారింది. ఇక ప్లాస్టిక్‌ బాటిల్స్‌గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వాడే వారి సంఖ్య ఎక్కువుతోంది.

అయితే ప్లాస్టిక్‌ వాడకం ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతునే ఉంటారు. అయితే ప్లాస్టిక్‌ బాటిల్స్‌ పెద్దలతో పోల్చితే చిన్న పిల్లలకు మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో పాలు లేదా నీరును చిన్నారులకు ఇవ్వడం మంచిది కాదని సూచిస్తున్నారు.

పాలను వేడి చేసి వాటిని ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో పోయడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో వేడి పాలు పోస్తే.. చిన్నారుల శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నారుల కడుపులోకి వెళ్లే మైక్రోప్లాస్టిక్‌ కారణంగా వారి మెదడుపై ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.