ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు ఇంత ఖరీదా..? ధర చూస్తే మతిపోవాల్సిందే

www.mannamweb.com


దేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల జోరు కొనసాగుతోంది. ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకున్నవారు ముందుగా వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

వివిధ రకాల ఫీచర్లు, ఆకట్టుకునే లుక్, పట్టణాల ట్రాఫిక్ లో సులభం నడిపే వీలు ఉండడం వీటి డిమాండ్ పెరగడానికి కారణం. అలాగే పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి తప్పించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే అవకాశం ఉండడం కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే వీటిలో మోటారు, బ్యాటరీ చాలా కీలకంగా ఉంటాయి. వాహనం ధరలో దాాదాపు సగం వాటికే వెచ్చించాలి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈవీల బ్యాటరీల ధరల గురించి తెలుసుకుందాం.

బ్యాటరీ ధర అధికం

మార్కెట్ లో అనేక కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఓలా, టీవీఎస్, బజాజ్ కంపెనీల స్కూటర్లకు డిమాండ్ ఉంటోంది. విక్రయాలలో ఈ కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. అలాగే ఈవీ స్కూటర్ ధరలో దాదాపు సగం దానిలోని బ్యాటరీ, మోటారుకే ఖర్చు అవుతుంది. ఎందుకంటే అవి రెండు అత్యంత కీలకంగా ఉంటాయి. అయితే కొనుగోలు దారులు ఒక్కోసారి బ్యాటరీలో లోపంతో మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. లేకపోతే వారంటీ పూర్తయిపోవడంతో కొత్త బ్యాటరీ కొనుగోలు చేయాల్సి రావచ్చు. ఆ సమయంలో వాటికి భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఓలా స్కూటర్ బ్యాటరీ

ఈ స్కూటర్ బ్యాటరీ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిపై గతేడాది సోషల్ మీడియా ఓ వీడియో వైరల్ అయ్యింది. దానిలో ఎస్ 1, ఎస్ 1 ప్రో బ్యాటరీలను చూపించారు. ఎస్ 1లో ఉపయోగించే 2.98 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ధర రూ.66,549, అలాగే ఎస్ 1 లో ఉపయోగించే 3.97 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ధర 87,298 అని బోర్డుపై రాశారు. ఇప్పుడు కూడా వాటి ధరలు దాదాపు అలాగే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రూ.60 వేల నుంచి 70 వేల మధ్యలో ఉన్నాయి.

టీవీఎస్ ఐక్యూబ్

టీవీఎస్ ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్ టీ 3 అనే మూడు రకాల వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. దీని టాప్ మోడల్ వేరియంట్ లో 3.4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన నానా రిమూవబుల్ బ్యాటర్ ప్యాక్ ఏర్పాటు చేశారు. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 145 కిలోమీటర్లు పరుగెడుతుంది. అయితే ఈ బ్యాటర్ ప్యాక్ కు మార్చాల్సి వస్తే దాదాపు రూ.56 వేల నుంచి రూ.70 వేలు వరకూ ఖర్చవుతుంది.

బజాజ్ చేతక్

బజాజ్ చేతక్ స్కూటర్ లో 3 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఈ కంపెనీ స్కూటర్లకు ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది. ఈ కంపెనీ ఈవీలపై దాదాపు మూడేళ్లు వారంటీ అందిస్తోంది. వారంటీ ముగిసిపోతే కొత్త బ్యాటరీ కోసం దాదాపు రూ.50 వేలు వెచ్చించాలి.