భూమిపై ఆరు ఖండాలేనా..? సంచలన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి

www.mannamweb.com


భూమిపై ఎన్ని ఖండాలు ఉన్నాయనే ప్రశ్నకు ఎవ్వరైనా చటుక్కున ఏడు అని బదులిస్తారు. ఇది సరైన సమాధానమే. ఈ ప్రశ్న మనకు అనేక పరీక్షలలో మార్కును సంపాదించిపెట్టింది.

భూమిపై ఉన్న ఏడు ఖండాల గురించి నిత్యం పుస్తకాలలో, పేపర్లలో, టీవీలలో వింటూనే ఉంటాం. అయితే ఇటీవల పరిశోధనకు ఒక కొత్త వాదన తీసుకువచ్చారు. భూమిపై ఆరు ఖండాలే ఉన్నాయని ఏడు కాదని చెబుతున్నారు. ఉత్తర అమెరికా, యూరప్ ఖండాలు విడిపోలేదని, ఇంకా కలిసే ఉన్నాయని వివరించారు. గ్రీన్‌లాండ్ సముద్రం, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్య ఉన్న ఐస్‌లాండ్ పై అధ్యయనం చేసి ఈ విషయాన్ని నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు.

భూమిపై ఆరు ఖండాలేనా..?

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. డాక్టర్ జోర్డాన్ ఫెథియన్ నేతృత్వంలోని డెర్బీ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం భూమికి ఆరు ఖండాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. యూరప్, ఉత్తర అమెరికా ఖండాల విడిపోవడం పూర్తి కాలేదని వివరించింది. దాదాపు 52 మిలియన్ల సంవత్సరాల క్రితం ఖండాలు విడిపోయినట్టు భావించారని, అయితే ఉత్తర అమెరికా, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఇంకా కలిసే ఉన్నాయని స్పష్టం చేసింది.

ఐస్‌లాండ్ పై అధ్యయనం

గ్రీన్‌లాండ్ సముద్రం, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్య ఉన్న ఐస్‌లాండ్ ను అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చినట్టు పరిశోధకులు తెలిపారు. అట్లాంటిక్ మధ్య శిఖరంలో ఏర్పడిన ఘర్షణ కారణంగా దాదాపు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఐస్ లాండ్ ఏర్పడిందని ఇప్పటి వరకూ నమ్మారు. అయితే కొత్త అధ్యయనం ఈ సిద్ధాంతాన్ని సవాలు చేస్తోంది. యూరోపియన్, ఉత్తర అమెరికా ఖండాలకు సంబంధించిన శకలాలు ఐస్‌ల్యాండ్, గ్రీన్‌ల్యాండ్ ఐస్‌ల్యాండ్ ఫారోస్ రిడ్జ్ (జీఐపీఆర్) లపై ఉన్నట్టు గుర్తించారు. వీటి గురించి పరిశోధకులు మాట్లాడుతూ ఇవి ఒకదానికితో ఒకటి అనుసంధానించిన ఖండాంతర నిర్మాణాలు అని తెలిపారు. వీటి భౌగోళిక లక్షణాల ఆధారంగా రిఫ్టెడ్ ఓషియానిక్ మాగ్మాటిక్ పీఠభూమి (ఆర్ఓఎంపీ) అని పేరు పెట్టారు.

ఇతర అంశాలపై అధ్యయనాలు ఇలా

లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్‌ని కనుగొనడానికి సమానమైన ఎర్త్ సైన్స్‌గా దీనిని భావిస్తున్నట్టు డాక్టర్ ఫెథియన్ వ్యాఖ్యానించారు. కోల్పోయిన ఖండం శకలాలు సముద్రం కింద మునిగిపోయాయని, కిలోమీటర్ల సన్నని లావా ప్రవహిస్తుందని వివరించారు. ఆఫ్రికాలోని అగ్నిపర్వత ఆఫ్రా ప్రాంతంలో చీలికల పరిణామాన్ని అధ్యయనం చేశారు. దానితో ఐస్‌లాండ్‌లోని భూమి ప్రవర్తనా తీరును పోల్చి పరిశోధించారు. ఈ రెండు ప్రాంతాలు చాలా సారూప్య మార్గాల్లో అభివృద్ధి చెందుతున్నాయని గుర్తించారు. కాగా.. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలు కలిసే ఉన్నాయా అనే దానిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు ఐస్‌లాండ్‌లోని అగ్నిపర్వత శిలలను అన్వేషించాలని పరిశోధకులు భావిస్తున్నారు.