డిగ్రీపాసై ఖాళీగా ఉన్నారా?.. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు పొందాలంటే అవసరమైన విద్యార్హతలు, స్కిల్స్ ఉండాల్సిందే. లేకపోతే ప్రస్తుత పోటీప్రపంచంలో నిలదొక్కుకోవడం కష్టం.


ప్రైవేట్ సెక్టార్ లో మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా దానికి సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఖచ్చితమైన ప్రణాళికతో చదవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది. ఇటీవల నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏపీ ఎకనామిక్స్ & స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌లో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే వీలైనంత త్వరగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. అసిస్టెంట్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 8 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీల సంఖ్య:

05
అర్హత:

బ్యాచిలర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (మ్యాథమెటిక్స్/ ఎకనామిక్స్/ కామర్స్/కంప్యూటర్ సైన్స్)లో స్టాటిస్టిక్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి:

01.07.2024 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు:

అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు కల్పించారు.
దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌
ఎంపిక విధానం:

రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.37,640- రూ.1,15,500 ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

18-04-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:

08-05-2024.