వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నారా..? ఇవి తప్పక తెలుసుకోండి.

ఫోన్‌లో ఛార్జింగ్ లేకపోతే ఏం తోచదు. ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు చాలా మంది పవర్ బ్యాంకులను ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైర్‌లెస్ పవర్ బ్యాంకులపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వైర్‌లెస్ పవర్ బ్యాంకుల వల్ల ఫోన్‌కు ఏమైన నష్టం వాటిల్లుతుందా అనే డౌట్లు చాలా మందికి ఉన్నాయి.

ఫోన్ లేకపోతే ఒక నిమిషం కూడా ఉండలేం. అంతలా మనిషి జీవితంలో భాగమైంది ఫోన్. ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్ని చిటికెలో చుట్టేయొచ్చు. అయితే ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోవడం చాలా మందిని చికాకు పెడుతుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వైర్‌లెస్ ఛార్జింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌ల ట్రెండ్ పెరిగింది. ఎందుకంటే అవి కేబుల్ లేకుండా మొబైల్‌ను ఛార్జ్ చేసే సౌకర్యాన్ని అందిస్తాయి. కానీ వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడం సరైందేనా? లేదా ఫోన్‌కు ఏమైనా నష్టాన్ని కలిగిస్తాయా..? అసలు వైర్‌లెస్ పవర్ బ్యాంక్ ఉపయోగాలు, నష్టాలు ఏంటీ..? ఈ స్టోరీలో తెలుసుకుందాం..


వైర్‌లెస్ పవర్ బ్యాంక్ ఉపయోగాలు :

వైర్‌లెస్ పవర్ బ్యాంక్ కాయిల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది విద్యుదయస్కాంత క్షేత్రం ద్వారా ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంది. మీరు మీ ఫోన్‌ను ఈ పవర్ బ్యాంక్‌పై ఉంచితే, ఛార్జింగ్ ప్రారంభమవుతుంది. ఈ రోజుల్లో ప్రజలు ఈ పరికరాన్ని ఎక్కువగా ఇష్టపడటానికి కారణం.. దానితో పాటు కేబుల్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కేబుల్‌ను పదేపదే కనెక్ట్ చేయడం ద్వారా ఛార్జింగ్ పోర్ట్ దెబ్బతింటుందనే భయం లేదు. ఇది చాలా ఆధునికంగా, స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్‌ను చాలా సులభంగా ఛార్జ్ చేయవచ్చు.

వైర్‌లెస్ పవర్ బ్యాంక్ సమస్యలు :

వైర్‌లెస్ ఛార్జింగ్ సమయంలో చాలా వేడి ఉత్పత్తి అవుతుంది. నిరంతర అధిక ఉష్ణోగ్రత ఫోన్ యొక్క బ్యాటరీని దెబ్బతీస్తుంది. దాని పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా వైర్‌లెస్ పవర్ బ్యాంక్ యొక్క ఛార్జింగ్ వేగం కేబుల్ పవర్ బ్యాంక్ కంటే చాలా స్లోగా ఉంటుంది. అందువల్ల ఫోన్ ఛార్జ్ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫోన్ ను సరైన యాంగిల్లో పెట్టకపోతే ఛార్జింగ్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ బ్యాటరీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. కాబట్టి వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌ని జాగ్రత్తగా వాడాలి. అవసరానికి అనుగుణంగా ఉపయోగిస్తే పెద్ద సమస్య ఉండదు. కానీ ప్రతిరోజూ ఫోన్‌ను దాంతోనే ఛార్జ్ చేస్తే ఫోన్ బ్యాటరీ, పనితీరును ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.