దాహం లేకున్నా నీళ్లు తాగేస్తున్నారా? మీ కిడ్నీలు, గుండె ఆరోగ్యం గోవిందా..

ఆరోగ్యంగా ఉండటానికి నీళ్లు చాలా అవసరం. అందుకే రోజు మొత్తంలో వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలని వైద్యులు చెబుతుంటారు. అలాగని అవసరరానికి మించి ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కూడా శరీరానికి ప్రమాదకరమట. అందుకే ఒక రోజులో ఎంత నీరు తాగాలి? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరీర ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుందని, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు అవసరానికి మించి నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.

ఎందుకంటే మూత్రపిండాలు నీటిని నిరంతరం ఫిల్టర్ చేయడానికి చాలా ఒత్తిడి ఎదుర్కోవల్సి ఉంటుంది. ఇది మెదడుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల మెదడు కణాలు వాపుకు గురవుతాయి.

దీనివల్ల తలనొప్పి, నిరంతరం గందరగోళం ఏర్పడుతుందని పరిశోధనలో తేలింది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా రక్తపోటు హెచ్చుతగ్గులకు కారణమవుతుంది.

సాధారణంగా ప్రతి వ్యక్తి రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగితే సరిపోతుంది. అయితే మీకు ఎక్కువగా చెమట పడుతుంటే మాత్రం కాస్త నీళ్లు ఎక్కువగా తాగాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.