అజీర్‌ పండ్లు ఎక్కువగా తింటున్నారా? అయితే చాలా ప్రమాదం

www.mannamweb.com


అంజీర్‌లో ఉండే ఆక్సిలేట్ శరీరంలో కాల్షియంను సంగ్రహించడం వల్ల కాల్షియం కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. అంజీర్ తినడం వల్ల శరీరంలో సల్ఫైట్ పెరుగుతుంది.

దాంతో మైగ్రెయిన్ ఎటాక్ రావచ్చు. అయితే, ఇది అంజీర్‌ అతిగా తినడం వల్లే వస్తుందని చెబుతున్నారు. అంజీర్‌తో కలిగే ఈ దుష్పరిణామాలు వాటిని అతిగా తిన్నప్పుడే ఉంటాయి.

ఏదైనా ఎలర్జీ సమస్యలతో బాధపడేవాళ్లు అంజీర్ తినకూడదు. అంజీర్ తినడం వల్ల వాటి గింజలు పేగులలో చిక్కుకుంటాయి. ఇవి లివర్‌ను దెబ్బతీసే ప్రమాదం కూడా లేకపోలేదు అంటున్నారు నిపుణులు. అంజీర్ అతిగా తినడం వల్ల పళ్లలో కీటాణువులు రావచ్చు. అందుకే మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు.

అంజీర్‌లో షుగర్ కంటెంట్ ఉంటుంది. అందుకే అతిగా తింటే మధుమేహం వ్యాధిగ్రస్థులకు మంచిది కాదు. ఐరన్ పుష్కలంగా ఉండే అంజీర్ తినడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.

అంజీర్‌ అతిగా తింటే, వాటిలో పీచు పదార్థం కారణంగా గ్యాస్, ఉబ్బరం ఏర్పడుతుంది. సర్జరీ తర్వాత అంజీర్ తింటే, స్టమక్‌ బ్లీడింగ్‌ రిస్క్ పెరుగుతుంది. అంజీర్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే షుగర్ పేషెంట్ల ఆరోగ్యం దెబ్బతినవచ్చు.

అలర్జీ సమస్యలు ఉన్నవారు అంజీర్ అస్సలు తినకూడదు. ఏదైనా సర్జరీ చేయించుకున్న వ్యక్తులు వీటిని తినే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా ఇదే రూల్ ఫాలో అవ్వాలి. డయాబెటిస్ రోగులు అంజీర్‌ను లిమిటెడ్‌గా తినాలి.