Chicken: మీరు చికెన్‌లోని ఈ భాగాలను తింటున్నారా?

చికెన్.. ఇలాళ ఎక్కువమంది తినే నాన్ వెజ్ ఫుడ్ చికెన్. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరు ఎక్కువగా ఇష్టపడేది ఈ చికెన్ మాత్రమే.


అందుకే మన చుట్టు వందల సంఖ్యలో చికెన్ వెరైటీల ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లు పెరుగుపోతున్నాయి. చికెన్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి జిమ్‌కి రెగ్యులర్‌గా వెళ్లేవారికి చికెన్ తినమని ట్రైనర్స్ సలహా ఇస్తుంటారు. అయితే ఇక్కడ చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని చికెన్ ఎక్కువగా తింటుంటే మీ ఆరోగ్యం నెమ్మది నెమ్మదిగా పాడైపోతుందని నిపుణులు చెబుతున్నారు. చికెన్‌లోని కొన్ని భాగాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. మరి ఆ వివరాల్లేంటో తెలుసుకుందామా.

చికెన్‌లో తిన కూడదని భాగాలు :

చర్మం

చాలామంది చర్మంతో చికెన్ వండుకుని తింటుంటారు. కానీ చికెన్ చర్మంలో అధిక కొవ్వు ఉంటుంది. ఇది బరువు పెరగడానికి అలాగే గుండె సంబంధిత వ్యాధులు రాడానికి కారణం అవుతుంది. అందుకే చికెన్ చర్మాన్ని తినొద్దని డాక్టర్లు చెబుతున్నారు.

మెడ

చాలామంది చికెన్ మెడను చాలా ఇష్టంగా తింటుంటారు. చికెన్ షాప్‌లోనే ఆ మెడ కావాలని మరో రెండు అదనంగా వేయించుకుని మరీ వాటిని తింటుంటారు. కానీ కోడి మెడ అసలు తినకూడదు. మెడ భాగంలో ఒకరకమైన వ్యవస్థ ఉంటుంది. ఇది పూర్తిగా వ్యర్ధపదార్దాలను కలిగి ఉంటుంది. మెడ తినడం అనారోగ్యాలు పాలయ్యే ప్రమాదం ఉంది.

తోక

కోడి తోక భాగంలో కూడా హానికరమైన పదార్ధాలు ఉంటాయి. అలాగే అధిక కొవ్వు ఉంటే భాగం కూడా ఈ తోకనే. అందుకే ఇది తినడం వల్ల అమాంతం బరువు పెరగడమే కాకుండా చాలారకాల ఆరోగ్య్ సమస్యలు తలెత్తుతాయి.

కొవ్వు

కొన్ని కోడుల్లో కొవ్వు ఉంటుంది. దీని ప్రత్యేకంగా వేయించుకుని మరీ వండుకుని తింటుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన కొవ్వు. ఈ కొవ్వులో చాలా రకాల విషపదార్ధాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల కాలేయ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

తొడలు

లెగ్ పీస్ అంటేనే పిల్లలకు ఇష్టం. కానీ ఈ లెగ్ పీస్‌లు చాలా విషపూరితమైనవి. ఎందుకంటే కోళ్లు బరువు పెరగడానికి ఈ కాళ్లలోనే ఇంజెంక్షన్లు చేస్తారు. అందుకే వీటికి ఎక్కువగా తినకూడదు.

వీటితో పాటు కోడి ఊపిరితిత్తులు, కాలేయం కూడా ఎక్కువగా తినకూడదు. ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అలాగే పరాన్నజీవులకు సంతానోత్పత్తి ప్రదేశంగా ఉంటుంది. దీనివల్ల ఇది తినొద్దని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఏం తినాలి? అనే ప్రశ్న మీకు వస్తే.. చికెన్‌లో బ్రెస్ట్ భాగాన్ని తినడం వల్ల ప్రోటీన్ మీ శరీరానికి అందుతుంది. అది వారానికి ఒక్కసారి మాత్రమే చికెన్ తినడం మంచింది. అంతకంటే ఎక్కువగా చికెన్ తినకూడదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.