రాత్రి భోజనం చెయ్యగానే బెడ్ ఎక్కేస్తున్నారా

రాత్రివేళ భోజనం ముగించుకున్న తరువాత చాలామంది రెస్ట్ తీసుకుంటారు. టీవీలో ఛానళ్లు తిప్పుతూనో, ఫోన్‌ చూస్తోనో గడిపేస్తారు. ఆ కొద్దిసేపటికే దుప్పటి కప్పుకొంటారు.


వాకింగ్ చేయాలనో.. లేదా ఓ నాలుగు అడుగులు వేద్దామనే ఆలోచన చాలామంది రాకపోవచ్చు. ఉదయం నుంచి వేర్వేరు పనులు, ఆఫీసుల్లో ఒత్తిడి.. ఇలాంటి కారణాల వల్ల భోజనం చెయ్యగానే బెడ్ ఎక్కడానికే ప్రాధాన్యత ఇస్తారు. అలా చేయడం దీర్ఘకాలానికి ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

దీనివల్ల మన శరీర బరువు మనకు తెలియకుండానే పెరిగే ప్రమాదం ఉంది. అది ఒబేసిటీకి దారి తీయొచ్చనే వాదనలు ఉన్నాయి. విధి నిర్వహణలోనో.. ఉదయం పూట వాకింగ్ లేదా జాగింగ్ చేశాం కదా అని సరిపుచ్చుకోవడానికి వీల్లేదు. మారుతున్న కాలానికి, ఆహార అలవాట్ల వల్ల రాత్రి భోజనం తరువాత కూడా కొంత వాకింగ్ చేయడం అత్యుత్తమం. భోజనం తరువాత కొద్దిసేపు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనం ఉన్నాయి.

శరీర బరువు ఇది నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, భోజనం తరువాత మరీ ఎక్కువ సమయం కాకుండా కొద్దిసేపు అటు ఇటు తిరిగినా సరిపోతుంది. అలా చేయడం వల్ల మెదడుకు కూడా విశ్రాంతి లభిస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గడంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ చురుకుగా పనిచేస్తుంది. మెటబాలిజం శాతం మెరుగుపడుతుంది. పెద్దగా శ్రమ పడకుండా బరువు తగ్గించుకోవడానికి వాకింగ్ ఆఫ్టర్ డిన్నర్ అనేది బెస్ట్ ఫార్ములా.

భోజనం చేసిన వెంటనే వాక్ చేయడం వల్ల ప్యాంక్రియాటిస్‌లో ఇన్సులిన్ శాతం పెరుగుతుంది. ఇది గ్లూకోజ్‌ను కండరాలకు అందిస్తుంది. బ్రిస్క్ వాక్ చేయడం వల్ల డయాబెటిస్‌ను కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. రాత్రి భోజనం తరువాత నడక వల్ల గాఢ నిద్ర కూడా పడుతుంది. నిద్రలేమి దూరమౌతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల గుండెజబ్బులు దూరమౌతాయి. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగు పడుతుంది. మానసిక ప్రశాంతతను కల్పిస్తుంది. స్ట్రెస్ తగ్గడానికి ఇదో మంచి చిట్కా.

భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు, ప్రేగులను ఉత్తేజపరచడం ద్వారా శరీర కదలికలు జీర్ణక్రియకు సహాయపడతాయి, తద్వారా ఆహారం త్వరగా కదులుతుంది. వారానికి కనీసం 10 గంటల పాటు నడవడం వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు, కొలరెక్టం, ప్యాంక్రియాస్, పిత్తాశయం, కాలేయం వంటి జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌లను నివారిస్తుంది. భోజనం తర్వాత చేసే వ్యాయామం మధుమేహం ఉన్నవారికి చాలా అవసరం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.