ఇంటర్ పాసై జాబ్ కోసం చూస్తున్నారా.. రూ.35 వేల జీతంతో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

ఇంటర్మీడియట్ పాసై ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సువర్ణావకాశం. ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


ఈ క్రమంలో ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ద్వారా 1446 పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. 1017 విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్ పోస్టులు, 429 లోడర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చే నెల(సెప్టెంబర్) 21గా ప్రకటించారు.

ఈ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు అన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ igiaviationdelhi.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో పదో తరగతి సిలబస్ ఉంటుంది. జనరల్ నాలెడ్జి, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఆంగ్లం, ఏవియేషన్ సబ్జెక్టులకు సంబంధించి 100 మార్కులకు 100 బహుళైచ్ఛిక రకం ప్రశ్నలు అడుగుతారు. ఈ ఎగ్జామ్‌కు నెగిటివ్ మార్కింగ్ లేదు.

అర్హతలు..

*ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి దేశంలో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

*లోడర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి 12 తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితోపాటు, అభ్యర్థులు ఇతర నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి.

*ఎయిర్‌పోర్టు గ్రౌండ్ స్టాఫ్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు. గరిష్ట వయస్సు 30 ఏళ్లు.

*లోడర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 20 ఏళ్లు. గరిష్ట వయస్సు 40 ఏళ్లు ఉండాలి.

జీతం..

*విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25 వేల-రూ.35వేల వరకు లభిస్తుంది.

*లోడర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15వేల-రూ.25వేల వరకు జీతం చెల్లిస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.