Personal Loan: పర్సనల్‌ లోన్ తీసుకునే ప్లాన్‌లో ఉన్నారా.? ఏ బ్యాంక్‌ బెస్ట్‌ అంటే..

www.mannamweb.com


ప్రతీ ఒక్కరికీ ఆర్థికపరమైన అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలను తీర్చుకునే క్రమంలో ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటారు, మరికొందరు స్థలం కాగితాలతో లోన్‌ తీసుకుంటారు. అయితే ఇవేవి లేకుండా రుణం పొందే ఆప్షన్‌ పర్సనల్ లోన్‌. మీరు ఉద్యోగం చేసే వ్యక్తి అయితే చాలు, మీ సిబిల్‌ స్కోర్‌ బాగుంటే చాలు. వెంటనే మీకు బ్యాంకులు ఎలాంటి పూచికత్తు లేకుండా లోన్స్‌ ఇస్తాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్క యాప్‌లో క్షణాల్లో మీ అకౌంట్‌లోకి లక్షల్లో రుణం వచ్చి పడే పరిస్థితి వచ్చింది. అయితే ఏ బ్యాంకులో రుణం తీసుకోవాలనే ఒక ప్రశ్న సాధారణంగానే వస్తుంది. ఇది ఆయా బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. మరి ప్రస్తుతం భారత్‌లో ఉన్న పలు ప్రధాన బ్యాంకులు పర్సనల్‌ లోన్‌కి ఎంత వడ్డీ వసూలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐలో వ్యక్తిగత రుణాలకు 12.30 శాతం నుంచి 14.30% వరకు వసూలు చేస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి 11.30% నుంచి 13.80 శాతం వరకు, రక్షణ రంగంలో పనిచేసే వారికి 11.15 నుంచి 12.65% వరకు వడ్డీని వసూలు చేస్తుంది.

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రుణాన్ని తీసుకునే వ్యక్తి సిబిల్ స్కోర్ ఆధారంగా 13.75% నుంచి 17.25% వరకు వడ్డీ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 12.75 నుంచి 15.25% వరకు వసూలు చేస్తారు.

* ఇక దేశంలో అదిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్‌లో పర్సనల్‌ లోన్‌కు గాను వినియోగదారుల నుంచి 10.65 శాతం నుంచి 16 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తారు.

* మరో ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వ్యక్తిగత రుణాలపై 10.5 నుంచి 24% వరకు వడ్డీ రూపంలో వసులు చేస్తుంది. తీసుకున్న రుణం ఆధారంగా ప్రాసెసింగ్ ఫీజు అదనంగా ఉంటుంది.

* బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పర్సనల్ లోన్ పై 13.15 నుంచి 16.75% వరకు వడ్డీలు వసూలు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 12.40% నుంచి 16.75% వరకు రుణాలు అందిస్తుంది.

* దేశంలో మరో ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన యాక్సిస్‌లో పర్సనల్ లోన్‌ తీసుకోవాలంటే 10.65 శాతం నుంచి 22 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.

* కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ విషయానికొస్తే ఈ బ్యాంకులో పర్సనల లోన్‌ తీసుకున్న వారు వడ్డీ రూపంలో 11 శాతం నుంచి 13 శాత వరకు చెల్లించాల్సి ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన వివరాలు ఆయా బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్స్‌లో పేర్కొన్న సమాచారం మేరకు అందించినవి. వ్యక్తిగత రుణాలు తీసుకోవాలనుకునే వారు నేరుగా బ్యాంకును సందర్శించే మరింత స్పష్టత వస్తుంది.