ఇల్లు అద్దెకు ఇస్తున్నారా? పోనీ తీసుకుంటున్నారా? – అద్దె ఒప్పందాల్లో కొత్త రూల్స్ వచ్చేశాయ్ – తెలుసుకోకపోతే నష్టపోతారు

భారతదేశంలో అద్దె ఒప్పందాలు మరింత సులభమయ్యేలా, వివాదాలు త్వరగా పరిష్కారమయ్యేలా ‘హోమ్ రెంట్ రూల్స్ 2025’ అమలులోకి వచ్చాయి.


మోడల్ టెనెన్సీ యాక్ట్ (MTA) , కేంద్ర బడ్జెట్ 2025 విధానాలపై ఆధారపడి ఈ నిబంధనలు, రెసిడెన్షియల్ , కమర్షియల్ రెంటు ఒప్పందాలకు ఏకీకృత విధానాన్ని అందిస్తున్నాయి. ఈ మార్పులు అద్దెదారులు, యజమానుల మధ్య సమతుల్యత సాధించడానికి, ఆర్థిక భారాన్ని తగ్గించడానికి తీసుకువస్తున్నారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి: రెండు నెలల్లోపు పూర్తి చేయాలి

ఈ కొత్త రూల్స్ ప్రకారం, ఏ రెంటు ఒప్పందాన్నైనా సంతకం చేసిన రెండు నెలల్లోపు రిజిస్టర్ చేయాలి. ఇది ఆన్‌లైన్‌లో స్టేట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ల ద్వారా లేదా స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయవచ్చు. సులభమైన ప్రక్రియ. ఇద్దరి గుర్తింపు పత్రాలు అప్‌లోడ్ చేసి, రెంటు వివరాలు ఫిల్ చేసి, ఈ-సైన్ చేసి సబ్మిట్ చేయాలి. దీని వల్ల ఒప్పందాల పారదర్శకతను పెంచి, భవిష్యత్ వివాదాలను తగ్గిస్తుందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్ ఒప్పందం సంతకం చేసిన తేదీ నుంచి 60 రోజుల్లోపు ఉంటుంది.

రిజిస్ట్రేషన్ చేయకపోతే ఫైన్ రూ.5,000

రెండు నెలల్లోపు అద్దె ఒప్పందం రిజిస్ట్రేషన్ చేయకపోతే, అద్దెదారు, యజమాని ఇద్దరిపైనా రూ.5,000 ఫైన్ విధిస్తారు. ఈ ఫైన్ వెంటనే చెల్లించాల్సి ఉంటుంది, లేకపోతే ఇంకా జరిమానాలు పెరుగుతాయి. ఈ నిబంధన ఒప్పందాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించడానికి తీసుకు వచ్చారు. దీని వల్ల అద్దె వివాదాలు తగ్గుతాయని అంచనా.

టెనెంట్లకు మేలు: సెక్యూరిటీ డిపాజిట్, రెంటు హైక్‌లు

టెనెంట్లకు ఈ రూల్స్ ఎక్కువ రక్షణ అందిస్తాయి. రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు సెక్యూరిటీ డిపాజిట్ రెండు నెలల రెంటుకు పరిమితం అవుతుంది. కమర్షియల్‌కు ఆరు నెలలకు. రెంటు పెంపు కేవలం నిర్దిష్ట నియమాల ప్రకారమే, ముందస్తు నోటీస్‌తో చేయాలి. అకస్మాత్తు ఖాళీ చేయాలన్న ఒత్తిళ్లు ఆగిపోతాయి. ఖాళీ చేయించే ప్రక్రియలు స్పష్టంగా నిర్వచిస్తారు. వివాదాలు స్పెషల్ రెంట్ కోర్టులు, ట్రిబ్యునల్‌ల ద్వారా 60 రోజుల్లోపు పరిష్కారమవుతాయి. ఈ మార్పులు అద్దెదారులకు మానసిక ఒత్తిడి తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి.

లాండ్‌లార్డులకు ప్రయోజనాలు: TDS ఎగ్జెంప్షన్, ట్యాక్స్ రిలీఫ్

లాండ్‌లార్డులకు కూడా ఈ రూల్స్ మేలు చేస్తాయి. రెంటల్ ఆదాయంపై TDS (టాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్) ఎగ్జెంప్షన్ పరిధి రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెరిగింది. రెంటల్ ఆదాయం ‘ఇన్‌కమ్ ఫ్రామ్ హౌసింగ్ ప్రాపర్టీ’ కిందకు వర్గీకరించారు. ట్యాక్స్ రిపోర్టింగ్ సులభమవుతుంది. మూడు నెలలు రెంటు చెల్లించకపోతే, రెంట్ ట్రిబ్యునల్‌లకు కేసు ఎగ్జిక్యూట్ చేసి త్వరగా పరిష్కారం చేయవచ్చు. సర్ సైన్ రెంట్లు చెల్లించడం, ఎనర్జీ ఎఫిషియెంట్ మెయింటెనెన్స్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్లు, స్టేట్ స్కీమ్‌లలో ఇన్సెంటివ్‌లు లభిస్తాయి.

భారతదేశంలో మార్పు దిశగా అద్దె రంగం

ఈ రూల్స్ భారతదేశంలో రెంటు మార్కెట్‌ను మరింత ఆధునికీకరించడానికి, వివాదాలను తగ్గించడానికి ఉపయోగడపతాయి. మునుపటి నిబంధనల్లో ఉన్న అస్పష్టతలు, వివాదాలు లు ఈ మార్పులతో తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. టెనెంట్లు, లాండ్‌లార్డులు తమ ఒప్పందాలు రిజిస్టర్ చేసుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత, రెంటు రంగంలో మరిన్ని మార్పులు రావచ్చని వర్గాలు తెలిపాయి. ప్రజలు తమ స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆన్‌లైన్ పోర్టల్‌లు ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.