ఉద్యోగ ఇంటర్వ్యూలలో పదే పదే విఫలమవుతున్నారా? శుభ ఫలితాలు ఇచ్చే వాస్తు చిట్కాలు ఇవే..


ప్రతి వ్యక్తి మంచి, స్థిరమైన ఉద్యోగం కావాలని కోరుకుంటాడు. చాలా సార్లు చదువు పూర్తి చేసిన తర్వాత ఎంత కష్టపడి పనిచేసినా, ఉద్యోగం కోసం పూర్తిగా తయారీ అయినప్పటికీ ఆశించిన ఫలితం లభించదు.


అలాంటి సమయాల్లో జ్ఞానం, ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు చుట్టూ ఉన్న సానుకూల శక్తి కూడా విజయాన్ని సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పర్యావరణ శక్తి మీ పని, ఆలోచనలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూ వంటి ముఖ్యమైన సందర్భంలో సరైన దిశలో కొన్ని చిన్న చర్యలు తీసుకుంటే.. అదృష్టం అనుకూలంగా మారుతుంది. సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగ ఇంటర్వ్యూలో శుభ ఫలితాలను ఇవ్వగల కొన్ని సులభమైన వాస్తు చిట్కాలు ఏమిటంటే..

ఈశాన్య దిశలో దీపం వెలిగించండి: ఈశాన్య దిశను జ్ఞానం, సానుకూలతకు చిహ్నంగా భావిస్తారు. ఇంటర్వ్యూ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ దిశకు ఎదురుగా నిలబడి నెయ్యి లేదా ఆవ నూనెతో దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు, మీ మనస్సులో విజయం కోసం ప్రార్థించండి. దేవుని ఆశీర్వాదం పొందండి. ఈ పరిహారం అనవసరమైన ఒత్తిడిని తొలగిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే, ఇంటర్వ్యూలో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

ఈ వస్తువులను మీ జేబులో పెట్టుకోండి: ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, మీ జేబులో ఐదు ఎండిన తులసి ఆకులను లేదా నల్ల నువ్వులను చిన్న పేకెట్ ని పెట్టుకోండి. తులసిని స్వచ్ఛత, శుభ శక్తికి చిహ్నంగా భావిస్తారు. అదే విధంగా నల్ల నువ్వులు ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. ఈ రెండు వస్తువులు మిమ్మల్ని చెడు దృష్టి నుంచి రక్షిస్తాయని, అదృష్టాన్ని బలపరుస్తాయని నమ్ముతారు. ఇంటర్వ్యూ సమయంలో వచ్చే ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవడంలో ఇది సహాయపడుతుంది.

ఇంటర్వ్యూ రోజున ఈ విషయాలను గుర్తుంచుకోండి: ఇంటర్య్వూకి వెళ్ళే సమయంలో లేత పసుపు రంగు లేదా క్రీమ్ రంగు దుస్తులు ధరించండి. ఈ రంగు మర్యాద, ఆకర్షణను తెలియజేస్తుంది. ఇంటి నుంచి ఇంటర్వ్యుకి బయటకు వెళ్ళే ముందు పెరుగు, బెల్లం కలిపి తినండి. అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. శక్తిని కూడా అందిస్తుంది. వెళ్ళేటప్పుడు, దేవుడికి చేతులు జోడించి నమస్కరించి ఆశీర్వాదం పొందడం మర్చిపోవద్దు.

తయారీ కూడా అవసరం: ఇంటర్వ్యుకి వెళ్ళేవారు మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే వాస్తు నివారణలు ప్రభావవంతంగా ఉంటాయని నిరూపించబడతాయి. ఇంటర్వ్యూ గురించి ప్రతికూల ఆలోచనలు లేదా భయం ఉంటే ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. కనుక ఉద్యోగం కోసం వెళ్ళే ముందు పూర్తి సన్నాహాలు చేసుకోవాలి. మీకు ఉన్న అర్హతలు.. ఉద్యోగాన్ని పొందేందుకు అర్హులని నిర్ధారించుకోవాలి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.