అప్పు.. నిద్రలేని రాత్రులను పరిచయం చేస్తుంది. మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మర్యాద లేకుండా చేస్తుంది. అవమానాలను పరిచయం చేస్తుంది.
కానీ ఇవేవి జరగకుండా ఈజీగా అప్పు తీర్చేందుకు సలహాలిస్తున్నారు నిపుణులు. పరిస్థితి చేదాటక ముందే జాగ్రత్తపడమని హెచ్చరిస్తున్నారు. లేదంటే జీవితంలో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని వార్నింగ్ ఇస్తున్నారు. అప్పు తీర్చడం కష్టమే కానీ క్రమశిక్షణ, వ్యయ నియంత్రణ, సరైన ప్రణాళికతో సాధ్యమే అంటున్నారు. ఒకసారి అప్పు పూర్తిగా తీరితే భవిష్యత్తులో అప్పు చేయకుండా ఉండేందుకు ఆదాయంలో కొంత భాగం ఆదా చేయడం అలవాటు చేసుకోమంటున్నారు. ఇంతకీ వీరిచ్చే సలహాలేంటి? చూద్దాం.
ఆర్థిక స్థితి విశ్లేషణ
* ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోండి.
* ఎంత మొత్తంలో అప్పులు ఉన్నాయి? వడ్డీ రేట్లు ఎంత? తీరాల్సిన సమయం ఏంటి? కచ్చితంగా లెక్కలు వేసుకోండి.
* అధిక వడ్డీ రేటుతో ఉన్న అప్పులను ముందుగా తీర్చేయండి.
బడ్జెట్ ప్లాన్
* నెలవారీ ఆదాయం, ఖర్చులను సక్రమంగా లెక్కలు వెయ్యండి.
* అవసరమైతే లగ్జరీ ఖర్చులను తగ్గించి, అప్పు తీర్చడానికి ఆ డబ్బును కేటాయించండి.
* 50% అవసరాలకు.. 30% కోరికలకు.. 20% అప్పు చెల్లింపులకు కేటాయించండి.
స్నోబాల్, అవలాంచే పద్ధతి
* స్నోబాల్ పద్ధతి: చిన్న మొత్తంలో ఉన్న అప్పులను ముందుగా తీర్చడం. ఇది మోటివేషన్ ఇస్తుంది.
* అవలాంచే పద్ధతి: అధిక వడ్డీ రేటు ఉన్న అప్పులను ముందుగా తీర్చడం. దీని వల్ల మొత్తంగా వడ్డీని తగ్గించుకోవచ్చు.
అదనపు ఆదాయ మార్గాలు
* ఫ్రీలాన్సింగ్, పార్ట్-టైమ్ జాబ్, ఆన్‌లైన్ వర్క్ ద్వారా అదనపు ఆదాయం సంపాదించండి.
* మీకు ఉన్న వనరులను (వాహనం, గది, పుస్తకాలు) అద్దెకు ఇవ్వడం కూడా మంచి ఆప్షన్.
నెగోషియేట్ & రిఫైనాన్స్
* బ్యాంకులతో మాట్లాడి వడ్డీ రేటును తగ్గించేలా ప్రయత్నించండి.
* ఒకే రకమైన అప్పులను క్రమబద్ధీకరించడం (డెట్ కన్సాలిడేషన్) ద్వారా వడ్డీ భారం తగ్గించుకోవచ్చు
* క్రెడిట్ కార్డ్ రుణాలను లోన్‌గా మార్చడం వలన వడ్డీ రేటు తగ్గవచ్చు
































