పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా..? కఫం లేకుండా వచ్చే ఈ దగ్గుకు అసలు కారణాలేంటో తెలుసా..?

దగ్గు అనేది మన శరీరం సహజ రక్షణ చర్యల్లో ఒకటి. శ్వాసనాళాల్లో చేరిన దుమ్ము, వైరస్‌ లు లేదా ఇతర పదార్థాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. అయితే కఫం లేకుండా వచ్చే పొడి దగ్గు మాత్రం చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పొడి దగ్గు చాలా మందికి ఆందోళన కలిగిస్తోంది.

పొడి దగ్గులో కఫం ఉండదు. ఇది గొంతులో గిజగిజ లాగా ఉంటుంది. సాధారణంగా శ్లేష్మం పొడిగా మారినప్పుడు లేదా గొంతు ఎర్రబడినప్పుడు మనం అటువంటి దగ్గును అనుభవిస్తాం. ఇది సాధారణంగా వాతావరణ మార్పులు, అలెర్జీలు, ధూమపానం లేదా కొన్ని మందుల ప్రభావం వల్ల రావచ్చు. పొడి దగ్గుకు సంబంధించి ముఖ్య కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


  • అలెర్జీ.. పుప్పొడి, జంతువుల వెంట్రుకలు వంటి వాటికి అలెర్జీ ఉన్నవారికి ఇది మామూలే.
  • వాతావరణం.. బాగా పొడి వాతావరణం గొంతు పొడిగా మారుస్తుంది.
  • ధూమపానం.. పొగ తాగడం వల్ల శ్వాసనాళాల్లో మార్పులు వచ్చి పొడి దగ్గుకు దారితీస్తుంది.
  • కొన్ని మందులు ముఖ్యంగా ACE ఇన్హిబిటర్లు (inhibitors).. రక్తపోటు మందుల ప్రభావంగా ఈ లక్షణం కనిపించవచ్చు.
  • ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు, లారింజైటిస్ (Laryngitis) వంటి జబ్బులు కారణం కావచ్చు.
  • నిద్ర లేకపోవడం, నిద్ర లేని రాత్రులు కూడా గొంతులో మంటను కలిగించి దగ్గు పెంచుతాయి.

ఇంట్లోనే అద్భుత పరిష్కారాలు

  • గోరువెచ్చని ఉప్పు నీటి పుక్కిలింత.. గొంతులో ఉన్న రోగకారకాలను తొలగించి ఉపశమనం ఇస్తుంది. చిటికెడు పసుపు కలిపితే మంట తగ్గించే శక్తి పెరుగుతుంది.
  • ఆవిరి పట్టడం.. తులసి, అల్లం, వాము ఆవిరి పట్టడం వల్ల శ్వాసనాళాలు శుభ్రం అవుతాయి.
  • తేనె తీసుకోవడం.. సహజ తేనెను ఒక స్పూన్ రోజులో రెండు సార్లు తీసుకుంటే గొంతు పొడిదనాన్ని తగ్గిస్తుంది.
  • హ్యూమిడిఫైయర్ వాడటం.. గదిలో తేమను పెంచడం ద్వారా గాలి పొడిగా ఉండకుండా చేసి గొంతు పాడవకుండా చూస్తుంది.
  • పసుపు వెల్లుల్లి తీసుకోవడం.. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ పసుపులోని కర్క్యుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
  • పైనాపిల్ తినడం.. ఇందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ గొంతు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
  • తులసి, మిరియాల వేరు చెక్కు నమలడం.. ఇది శ్వాసనాళాల్లో ఉన్న పొడి పదార్థాలను మృదుత్వం చేస్తుంది.
  • నీరు బాగా తాగడం.. రోజు మొత్తం క్రమం తప్పకుండా నీరు తాగడం గొంతును తేమగా ఉంచుతుంది. ఇది పొడి దగ్గు తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగండి.
  • ప్రోబయోటిక్స్ తీసుకోవడం.. పెరుగులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శ్వాస సంబంధిత ఇన్‌ ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని మెరుగుపరుస్తుంది.

పొడి దగ్గు చిన్న సమస్య అనిపించవచ్చు, కానీ దీన్ని పట్టించుకోకపోతే దీర్ఘకాలిక సమస్యలుగా మారే అవకాశం ఉంది. పైన చెప్పిన ఇంటి చిట్కాలు సహజమైనవి, దుష్ప్రభావాలు లేకుండా పనిచేస్తాయి. కానీ సమస్య కొనసాగితే వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.