సాధారణ పదార్థాలతో శక్తివంతమైన మిశ్రమం.. ఈ పద్ధతికి రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్, ఒక గ్లాసు నీరు కావాలి. ఈ రెండింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
ఇది బొద్దింకలు, బల్లులను భయపెట్టే శక్తివంతమైన మిశ్రమం. ఎలాంటి హానికర రసాయనాలు లేకుండా తయారయ్యే ఈ మిశ్రమం వాతావరణాన్నే మార్చేస్తుంది.
ఇప్పుడు ఒక ఖాళీ స్ప్రే బాటిల్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని పోసి మూత పెట్టి బాగా షేక్ చేయాలి. ఇది ఇప్పుడు క్రిములపై పోరాడేందుకు సిద్ధంగా ఉంటుంది. రోజూ ఒక్కసారైనా స్ప్రే చేయడం వల్ల ఇంటిలో ఏ కీటకాలు ఉండలేవు.
బొద్దింకలు ఎక్కువగా వంటగదిలో ఉండే సింక్ కింద, స్టవ్ పక్కన లేదా మూసివేసిన ప్రదేశాల్లో కనిపిస్తాయి. అలాంటి చోట్ల రోజూ ఈ స్ప్రేను వాడాలి. కనీసం వారం రోజులపాటు ప్రతి రోజు చేస్తే మంచి మార్పు కనిపిస్తుంది. మొదట్లో అవి మళ్లీ వస్తున్నట్లే అనిపించినా.. క్రమంగా తగ్గిపోతాయి.
రాత్రి వంటగదిని శుభ్రంగా తుడిచిన తర్వాత కౌంటర్ మీద కొద్దిగా ఈ స్ప్రే మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. అప్పుడు మనం నిద్రలో ఉన్న సమయంలో బొద్దింకలు ఆ ప్రాంతానికి దగ్గరయ్యే అవకాశం ఉండదు. ఇది ఇంటి పరిశుభ్రతకూ, క్రిములు దూరంగా ఉండటానికీ సహాయపడే మంచి అలవాటు.
బల్లులు ఎక్కువగా వెలుతురు దగ్గరకి వస్తుంటాయి. ట్యూబ్ లైట్, చిన్న బల్బ్ దగ్గర కనిపించటం సాధారణం. అలాంటి చోట్ల కూడా ఈ స్ప్రే కొద్దిగా పిచికారీ చేయాలి. వెలుతురు చూసి బల్లులు అక్కడికి రావాలని ప్రయత్నించినా.. ఈ మిశ్రమం వాసన వల్ల అవి వెనక్కి తిరిగి పోతాయి.
ఈ పద్ధతిని వారం రోజులు కచ్చితంగా పాటిస్తే మీరు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. మొదట్లో అసలు ఫలితం కనిపించకపోయినా.. క్రమంగా బొద్దింకలు, బల్లులు కనిపించకుండా పోతాయి. సహజమైన మార్గాన్ని ఉపయోగించటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉండదు. పైగా ఖర్చు కూడా తక్కువ.
ఈ సింపుల్ హోం రెమెడీ సహాయంతో బొద్దింకలు, బల్లుల బాధ నుంచి తేలికగా విముక్తి పొందవచ్చు. ఇంట్లో వాతావరణం కూడా హాయిగా ఉంటుంది. ఇక ఇంటిలో తిరుగుతున్న వీటిని చూసి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
































