చంద్రబాబు సర్కార్‌కు బిగ్ షాక్..ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్

www.mannamweb.com


చంద్రబాబు సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏపీలో ఆరోగ్య సేవలు ఆగిపోయాయి. సోమవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది.

ఇప్పటి నుంచి EHS, OP సేవలను మాత్రమే బంద్ చేస్తున్నట్లు తెలిపింది.ఏపీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్‌ దీనిపై మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3 వేల కోట్ల రావాల్సి ఉందని తెలిపారు.ఆస్పత్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇక మీదట ఉచిత వైద్య సేవలు అందజేయలేమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ సేవ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు.

దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని, తమ నోటీసులపై ట్రస్ట్ సీఈఓ స్పందించారని విజయ్‌కుమార్‌ చెప్పుకొచ్చారు.ట్రస్ట్ సీఈఓ ఫోన్ చేసి బకాయిలు క్లియర్‌ చేస్తామని చెప్పారని.. ఈ క్రమంలో రేపు చర్చకు ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని విజయ్‌కుమార్‌ హెచ్చరించారు. రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇక ఉద్యోగులు సైతం కూటమి ప్రభుత్వంలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వచ్చేవో తెలిసేది కాదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా కూటమికి మద్దతుగా నిలిచారు. అటు కూటమి ప్రభుత్వం సైతం ఉద్యోగులకు మొదట్లో మొదటి తేదీనే జీతాలు అందించింది. తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొంతమంది ఉద్యోగులకు 5 తారీఖు వచ్చినా జీతాలు అందడం లేదు. దీంతో ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి నెలకొంది.