Arthritis: మీరు నిలబడి నీళ్లు తాగుతున్నారా? మోకాళ్ల నొప్పులు గ్యారెంటీ..

www.mannamweb.com


మనకు వచ్చే వ్యాధులలో సుమారు 70% వాతం వల్ల వచ్చేవే. మన శరీరంలో వచ్చే నొప్పులు 90% వాతం కారణంగానే వస్తాయి. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? వాతం రాకముందే ఎలా గుర్తించాలి?
నివారణకు ఏం చేయాలి?అన్నది ప్రముఖ ఆయుర్వేదిక్‌ డా. నవీన్‌ నడిమింటి మాటల్లోనే..

►శరీరంలో కాల్షియం తగ్గితే 50కి పైగా జబ్బులు వస్తాయి.
► మన శరీరంలో40-45 ఏళ్ల వరకే మనం తీసుకునే ఆహరం నుంచి కాల్షియం తయారవుతుంది.
► శరీరంలో కాల్షియం తగ్గితే ఎముకలకి సంబంధించిన నొప్పులు, కఫానికి సంబంధించిన జబ్బులు వస్తాయి.
► కీళ్లనొప్పులు, భ/జాల నొప్పులు, మోకాళ్లు, నడుము నొప్పులు వస్తాయి.
► స్త్రీలకు 45ఏళ్లు పూర్తికాగానే, మోనోపాజ్‌ దశ మొదలవుతుంది. దీంతో శరీరం కాల్షియంను తీసుకునే సామర్థ్యం కోల్పోతుంది.

కొందరికి యూరిక్‌ యాసిడ్‌ వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఈ మధ్యకాలంలో వాత రోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చలికాలంలో చల్లదనం వల్ల వాతం పెరిగి నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. శరీరంలో వాతం పెరిగితే నిద్ర పట్టకపోవచ్చు.

కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు

పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, అరటిపండు, నారింజ, కమలా, బత్తాయి, ద్రాక్ష, మామిడి పండ్లు
45ఏళ్లు నిండిన తర్వాత,పండ్లు తీసుకున్నా శరీరంలో కాల్షియంను జీర్ణం చేసే హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో బయటి నుంచి కాల్షియంను తీసుకోవాల్సి ఉంటుంది.
వాతం..ఇలా గుర్తించండి

► చేతి, కాళ్ల కదలికలు స్టిఫ్‌ అవుతున్నట్లు, ఏదైనా నొప్పి కలిగిస్తున్నట్లు ఉంటే వాతానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించండి.
► ఉదయం నిద్రలేచే సమయానికి పూర్తిగా స్టిఫ్‌గా శరీరం ఉంటే వాతం ఉన్నట్లు గమనించండి.
► ఫ్యాన్‌ వాతాన్ని చాలా ఎక్కువగా పెంచుతుంది. కాబట్టి వేగంగా తిరిగే ఫ్యాన్‌ కింద నేరుగా పడుకోవద్దు.
► పలుచటి దుప్పటి కప్పుకొని కాస్త పక్కకు పడుకోవాలి.
► గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి.

వాతం నివారణకు ఇలా చేయండి.

1. సున్నం తీసుకోండి:

45 ఏళ్లు దాటిన స్త్రీలు, పురుషులు ఎవరైనా తప్పకుండా సున్నం తీసుకోవాలి. సున్నంలో కాల్షియం పరిపూర్ణంగా ఉంటుంది. ఇందులో మన శరీరానికి కావల్సిన సూక్ష్మపోషకాలు ఉన్నాయి.

1.సున్నం ( 1 గ్రాము ) + 1 గ్లాసు నీళ్ళు (1 గ్రాము — గోధుమ గింజంత మోతాదు )
సున్నంని నీళ్ళలో బాగా కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి.

2.సున్నం + పెరుగు లేక మజ్జిగ .
సున్నంని పెరుగు లేక మజ్జిగలో కలిపి మధ్యాహ్నం భోజనము తర్వాత మాత్రమే తీసుకోవాలి.
3. ఆర్థరైటిస్‌ ఉన్నవారు రోజుకు రెండు గ్రాముల సున్నం తీసుకోవాలి.

గమనిక: శరీరంలో రాళ్లు(కిడ్నీలో స్టోన్స్‌)ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సున్నంని తీసుకోరాదు.

మెంతులు మంచి ఔషధం

1.మెంతులు ఔషధాల గని. ఇవి వాతం, కఫాన్ని తగ్గిస్తాయి.

2.రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని లేదా వేడి నీటిలో 1 చెంచా మెంతులు నానబెట్టి ఉదయాన్నే పరగడుపున బాగా నమిలితినాలి.
మెంతుల కంటే సున్నం వాతనాశినిగా ఆయుర్వేదంలో చెప్పుకుంటారు.

3.పారిజాత వృక్షం చెట్టు ఆకులు ఎక్కువ క్షౌరగుణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆకులను రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో వేసి ఆ నీటిని అరగ్లాసు అయ్యేదాకా వేడి చేసి, ఉదయం పరగడుపునే ఆకులతో సహా గుటకగా తాగాలి. ఇది అన్ని రకాల ఆర్థరైటిస్‌ను తగ్గిస్తుంది. ఈ కషాయం దీర్ఘకాలిక రోగాలకు మంచి మందులా పనిచేస్తుంది.

గమనిక: ఈ కషాయం వాడుతున్నప్పుడు ఎలాంటి ఇతర మందులు వాడరాదు. ఈ కషాయం వల్ల 2-3 నెలల్లోనే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

♦ యూరిక్‌ యాసిడ్‌ వల్ల మోకాళ్ల నొప్పులు ఉన్నవారు.. నల్ల నువ్వులు,బెల్లాన్ని కలిపి తీసుకోవాలి.
♦ ఆస్తమా + ఆర్ధరైటీస్ ఉన్నవారు దాల్చిన చెక్క + శొంటి కషాయాన్ని తప్పనిసరిగా తాగాలి.
♦ స్థూలకాయం + ఆర్ధరైటీస్ ఉన్నవారు కూడా బెల్లాన్ని తీసుకోవచ్చు.
♦ పెద్ద వయస్సు వారికి మోకాళ్ల నొప్పులు ఉంటే సున్నం తీసుకుంటే సరిపోతుంది.
♦ భుజాల నొప్పులు, మోచేతి నొప్పులకు నీటిని చిన్నగా గుటకగుటకగా తాగితే నొప్పులు తగ్గిపోతాయి.
♦ కీళ్ల నొప్పులు ఉన్నారు భోజనం చేసిన వెంటనే వేడినీళ్లు తాగాలి.
♦ ఉపవాస సమయంలో చల్లటి పండ్లరసాలు తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఎక్కువ సేపు కడుపు ఖాళీగా ఉంటే వాతం పెరిగి కాళ్లు, చేతులు, నడుము నొప్పులు వస్తాయి. వేడినీళ్లు తాగితే ఏ ఇబ్బందీ ఉండదు.

మంచినీళ్లు నిలబడి తాగుతున్నారా?
►మంచినీళ్లు తాగేటప్పుడు కూర్చొని తాగాలి. అంతేకాకుండా నీళ్లు ఎప్పుడు తాగినా గుటక గుటకగా తాగాలి.
► నిలబడి నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు ఎప్పటికీ తగ్గవు. ఏ మందులు వాడినా ఫలితం ఉండదు.
► సైంధవ లవణం ( Rock Salt ),శుద్దమైన వంట నూనె వాతం శాతన్ని పెంచకుండా చేస్తుంది.

– డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు
ఫోన్ -9703706660