మూవీ లవర్స్ కు పండగ కానుక.. ఆ రోజు OTTలోకి దేవర

www.mannamweb.com


చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా చివరికి ఓటీటీ లోకి రావాల్సిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా దేవర. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. భారీ అంచనాల మధ్యన సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన దేవర ప్రభంజనం సృష్టిస్తుంది. ఒకటా రెండా మరి ఆరేళ్ళ నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టే తారక్ ఇరగదీశాడు.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను మడతపెడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా 500 కోట్ల మార్క్ కు దగ్గరగా ఉంది. ఇప్పట్లో ఈ సినిమాకు పోటీగా ఏ సినిమాలు లేవు. దసరాకు మాత్రం రజినీకాంత్ వెట్టయ్యన్‌ తో వస్తున్నాడు. ఒకవేళ ఆ సినిమాకు ఏ మాత్రం యావరేజ్ లేదా నెగిటివ్ టాక్ వచ్చినా.. ఇంకొంత కాలం దేవర థియేటర్స్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం దేవర లాభాల బాట పట్టినట్లే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ డేట్ వినిపిస్తుంది.

ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలన్నీ నెల లోపే ఓటీటీ లో దర్శనం ఇస్తున్నాయి. ఇక భారీ బజ్ ఉన్న సినిమాలైతే కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రస్తుతం దేవర థియేటర్స్ ను షేక్ చేస్తుంది. కాబట్టి, ఇప్పట్లో ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చే అవకాశమే లేదని.. అంత ఫిక్స్ అయ్యారు. కానీ మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. త్వరలోనే దేవరను ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కు ముందే.. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.150 కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ ను కొనుగోలు చేసింది. అలాగే మూవీ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చేలా డీల్ కుదుర్చుకుంది. సో ఇప్పుడు దేవర మూవీని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట మేకర్స్. ఒకవేళ ఆరోజు కాకపోతే దాదాపు నవంబర్ రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్సుమెంట్ ఇవ్వనున్నారు మేకర్స్.

ఇక దేవర రిలీజ్ అయ్యి 10 రోజులు ముగుస్తున్నా కూడా.. థియేటర్స్ మాత్రం హౌస్ ఫుల్ తో కళాకలాడుతున్నాయి. దసరా హాలిడేస్ , రిలీజ్ కు ఏ సినిమాలు లేకపోవడం, కథ , కథనం అదిరిపోవడం , తారక్ విశ్వరూపాన్ని చూపించడం. ఇలా ప్రతిదీ దేవరకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. గురి చేసి సరైన సమయంలో దేవరను దించి.. బాక్స్ ఆఫీస్ లెక్కలు తేల్చేస్తున్నాడు కొరటాల. థియేట్రికల్ ఎండ్ లోపు అనుకున్న మార్క్ ను టచ్ చేస్తాడో లేదో చూడాలి. అటు దేవర రాబోయే సినిమాలకు కూడా దేవర టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.