ఎన్ఐసీఎల్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు – ఏపీ, తెలంగాణ‌లో ఖాళీలు ఎన్నంటే?

www.mannamweb.com


నేష‌న‌ల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్‌)లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసిస్టెంట్స్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 21, తెలంగాణ‌లో 12 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఆఖ‌రు తేదీ న‌వంబ‌ర్ 11గా నిర్ణ‌యించారు.

దేశంలోని ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌భుత్వ రంగం ఇన్సురెన్స్ కంపెనీ ఎన్ఐసీఎల్ అసిస్టెంట్స్ (క్లాస్ III) పోస్టుల భ‌ర్తీకి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. దేశ‌వ్యాప్తంగా 500 పోస్టులను భ‌ర్తీ చేయ‌గా, అందులో ఎస్సీ-43, ఎస్టీ-33, ఓబీసీ-113, ఈడ‌బ్ల్యూఎస్-41, జ‌న‌ర‌ల్ -270 పోస్టులు ఉన్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 21 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. అందులో రిజ‌ర్వేష‌న్ వారీగా పోస్టులు చూస్తే ఎస్టీ-2, ఓబీసీ-7, ఈడబ్ల్యూఎస్-2, జ‌న‌ర‌ల్ -10 ఉన్నాయి. ఇందులో రెండు పోస్టులు దివ్యాంగుల‌కు, రెండు మాజీ సైనికోద్యుగుల‌కు, ఒక‌టి డిసెక్స్ (మాజీ సైనికోద్యుగుల్లో దివ్యాంగులు), డీఎక్స్ఎస్ (చ‌ర్య‌ల్లో చ‌నిపోయిన సైనికులపై ఆధార‌ప‌డినవారు)ల‌కు కేటాయించారు. ఎస్సీ రిజ‌ర్డ్వ్ ఒక్క పోస్టు కూడా లేదు.
రిజ‌ర్వేష‌న్ వారీగా పోస్టులు

తెలంగాణ‌లో 12 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. అందులో ఎస్సీ- 1, ఎస్టీ-1, ఓబీసీ-4, ఈడబ్ల్యూఎస్-1, జ‌న‌ర‌ల్ -5 ఉన్నాయి. ఇందులో 1 పోస్టు దివ్యాంగుల‌కు, ఒక‌టి మాజీ సైనికోద్యుగుల‌కు, ఒక‌టి డిసెక్స్ (మాజీ సైనికోద్యుగుల్లో దివ్యాంగులు), డీఎక్స్ఎస్ (చ‌ర్య‌ల్లో చ‌నిపోయిన సైనికులపై ఆధార‌ప‌డినవారు)ల‌కు కేటాయించారు.

గుర్తింపు పొందిన యూనివ‌ర్శిటీ, విద్యా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో రెగ్యూల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2024 అక్టోబ‌ర్ 1 లోపు ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఆధారంగా ఉండాలి. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాష రాయ‌డం, చ‌ద‌వ‌డం రావాలి. ఎంపిక చివ‌రి ద‌శ‌కు వ‌చ్చే ముందు ప్రాంతీయ భాష‌పై ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

2024 అక్టోబ‌ర్ 1 నాటికి వ‌య‌స్సు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రిమిలేయ‌ర్‌) అభ్య‌ర్థుల‌కు మూడేళ్లు, దివ్యాంగు అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు, మాజీ సైనికుద్యోగుల‌కు మూడేళ్లు (45 ఏళ్ల వ‌ర‌కు), వితంతువుల‌కు ఐదేళ్లు (జ‌న‌ర‌ల్, ఈడ‌బ్ల్యూఎస్ వారికి 35 ఏళ్ల‌, ఓబీసీ వారికి 38 ఏళ్ల‌, ఎస్‌సీ, ఎస్‌టీ వారికి 40 ఏళ్ల‌), కంపెనీ ఉద్యోగికి అయితే ఐదేళ్ల‌ వ‌య‌స్సు స‌డ‌లించారు.నెల‌కు రూ.39 వేలు ఉంటుంది. ఇత‌ర ప్ర‌భుత్వ అలవెన్సులు, బెనిఫిట్స్ ఉంటాయి.

ద‌ర‌ఖాస్తు దాఖ‌లు…అప్లికేష‌న్‌ ఫీజు ఎంత‌?

ద‌ర‌ఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://ibpsonline.ibps.in/niclaoct24/ క్లిక్ చేస్తే దాఖ‌లు చేసుకోవ‌చ్చు. అలాగే అప్లికేష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్‌, ఈడ‌బ్ల్యూఎస్, ఓబీసీ అభ్య‌ర్థులు రూ.850 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల అభ్య‌ర్థుల‌కు రూ.100 ఉంది. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఇత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://nationalinsurance.nic.co.in/sites/default/files/2024-10/DETAILED%20ADVERTISEMENT-%20RECRUITMENT%20OF%20500%20ASSISTANTS%20%28CLASS-III%29.pdf క్లిక్ చేయండి. పూర్తి వివ‌రాలు అందుబాటులో ఉన్నాయి.
ఆన్‌లైన్ ప‌రీక్ష‌….

ప‌రీక్ష రెండు ర‌కాలుగా ఉంటుంది. ప్రిలిమిన‌రీ, మెయిన్స్ ప‌రీక్ష‌లు ఉంటాయి. మెయిమ్స్ ఎగ్జామ్ క్యాల‌ఫై అయిన అభ్య‌ర్థులను ప్రాంతీయ భాష ప‌రీక్ష‌ల‌కు షార్ట్ లిస్ట్ చేస్తారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్‌) 100 మార్కుల‌కు ఉంటుంది. ప‌రీక్షా స‌మ‌యం గంట‌పాటు ఉంటుంది. మూడు సెక్ష‌న్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ (30 ప్ర‌శ్న‌లు-30 మార్కులు), రీజ‌నింగ్ అబిలిటీ (35 ప్ర‌శ్న‌లు-35 మార్కులు), క్వాంట‌టివ్ ఆప్టిట్యూడ్ (35 ప్ర‌శ్న‌లు-35 మార్కులు) ఉంటాయి.

మెయిన్స్ ప‌రీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్‌) 200 మార్కుల‌కు ఉంటుంది. ప‌రీక్షా స‌మ‌యం రెండు గంట‌లు ఉంటుంది. ఇందులో ఐదు సెక్ష‌న్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ (40 ప్ర‌శ్న‌లు-40 మార్కులు), రీజ‌నింగ్ (40 ప్ర‌శ్న‌లు-40 మార్కులు), న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ (40 ప్ర‌శ్న‌లు-40 మార్కులు), జ‌న‌ర‌ల్ అవెర్‌నెస్ (40 ప్ర‌శ్న‌లు-40 మార్కులు), కంప్యూట‌ర్ నాలెడ్జ్ (40 ప్ర‌శ్న‌లు-40 మార్కులు) ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహాయించి, మిగిలిన అన్ని స‌బ్జెక్టులు హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ప‌రీక్ష ఉంటుంది. ప‌రీక్ష‌ల‌కు ఆన్‌లైన్‌లో శిక్ష‌ణ ఇస్తారు. ఈ అధికారిక వెబ్‌సైట్ https://nationalinsurance.nic.co.in/ లోని రిక్య్రూట్‌మెంట్ విభాగంలో రెగ్యూల‌ర్‌గా చెక్ చేయాలి.

ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ, ఒంగోలు, విశాఖ‌పట్నంల్లో ప‌రీక్ష కేంద్రాలు కేటాయించారు. తెలంగాణ‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, వ‌రంగ‌ల్‌ల్లో ప‌రీక్ష కేంద్రాలు కేటాయించారు. మెయిన్స్ ఎగ్జామ్‌కు ఏపి, తెలంగాణ‌కు క‌లిపి హైద‌రాబాద్‌లోనే పరీక్షా కేంద్రం కేటాయించారు.