నారాయణ స్కూల్‌లో దారుణం.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

www.mannamweb.com


ఉపాధ్యాయుడి వేధింపులతో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన సోమవారం అర్ధరాత్రి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన లోహితాక్ష రెడ్డి హయత్ నగర్ పరిధిలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం జరిగిన పాఠశాల తరగతుల్లో భాగంగా ఫిజిక్స్ ఉపాధ్యాయుడు క్లాస్ రూంలో లోహితాక్ష రెడ్డిని క్లాస్ లీడర్‌తో కొట్టించడంతో అతకు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 11 గంటల సమయంలో లోహిత్ హాస్టల్ గదిలో ఫ్యాన్2కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాగా, ఉపాధ్యాయుడు వేధింపులతోనే విద్యార్థి మృతి చెందాడంటూ విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకు చనిపోయాడనే విషయం పోలీసులు చెబితేనే తెలిసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క్లాస్‌లో అసలు ఏం జరిగింతే ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మృతుడి తండ్రి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రూ.లక్షల్లో ఫీజులు కట్టించుకున్న నారాయణ పాఠశాల యజమాన్యం తన కుమారుడి చావు కారణమైందని ఆరోపించారు. కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ వేధింపుల మూలంగానే తన కొడుకు తనువు చాలించాడని, స్కూల్ యజమాన్యంతో పాటు ఫిజిక్స్ లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తన కొడకు మృతిపై లోతైన విచారణ జరిపాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.