విద్యార్థులకు శుభవార్త.. ఉచితంగా విద్యాకానుక కిట్లు అందించనున్న బాబు సర్కార్..!

విద్యార్థులకు శుభవార్త.. ఉచితంగా విద్యాకానుక కిట్లు అందించనున్న బాబు సర్కార్..!


ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. హాలీడేస్ అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్‌ 12 నుంచి పాఠశాలలు తిరిగి రీఓపెన్ అవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు జూన్‌ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలను ఈనెల 12కు బదులు 13 వ తేదీన రీఓపెన్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేయాలని, ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తుండడంతో సెలవు ఒకరోజు పొడిగించాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు.

దీంతో ఏపీలో స్కూళ్లు 13 న ఓపెన్ అవ్వనున్నాయి. అయితే ప్రతి ఏటా జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌తో కూడిన కిట్లు ఇచ్చేది. ఈ నెల 13 నుంచి యధావిధిగా విద్యాకానుక కిట్లకు బదులుగా చంద్రబాబు నాయుడు స్టూడెంట కిట్లుగా పేరు మార్చి ఇవ్వనున్నారట. అలాగే స్కూల్ బ్యాగులపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోను తొలగించనున్నారని సమాచారం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో విద్యాకానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో కొత్త ప్రభుత్వం వాటిపై కూడా విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.