Bad Cholesterol: బాడీలో చెడు కొలెస్ట్రాల్.. బాగా పేరుకుపోయిందని తెలిపే లక్షణం ఇదే..

www.mannamweb.com


పేలవ జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, సెడెంటరీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామందిని కొన్ని రకాల వ్యాధులు వేధిస్తున్నాయి. వయసుతో తేడా లేకుండా అందరూ లైఫ్‌స్టైల్ డిసీజ్‌ల బారిన పడుతున్నారు.
ముఖ్యంగా, హై కొలెస్ట్రాల్ సమస్య క్రమక్రమంగా పెరుగుతోంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి అడ్డుగోడలుగా మారి రక్త ప్రసరణకు ఆటంకం కలగడం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్, ఇతర వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ఇది హైపర్‌టెన్షన్, డయాబెటిస్ వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. మరి, మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ ఎలా గుర్తించాలి? ఏయే లక్షణాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయులను సూచిస్తాయో తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ రకాలు
మన బాడీలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలుగా ఉంటుంది. మంచి కొవ్వును హై డెన్సిటీ లిపోప్రొటీన్(HDL), చెడు కొవ్వును లో డెన్సిటీ లిపోప్రొటీన్(LDL)గా పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే శరీరానికి హానికరం. ఇది రక్తనాళాలను గడ్డకట్టేలా చేసి రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఫలితంగా, వివిధ రకాల వ్యాధులు వస్తాయి. అదే సమయంలో మంచి కొవ్వు రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెకు బ్లడ్ సర్కులేషన్ సాఫీగా సాగేలా చేస్తుంది. హై డెన్సిటీ లిపోప్రొటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. అయితే, జీవనశైలిలో మార్పులతో బాడీకి హానిచేసే ఎల్డీఎల్ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

లక్షణాలు ఇవే..!
బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీర భాగాల్లో కొన్ని మార్పులు వస్తాయి. ముందు కాళ్లు ఎఫెక్ట్ అవుతాయి. కాళ్లలోని రక్త నాళాలు సన్నగా మారి నొప్పి రావచ్చు. దీంతో కాస్త దూరం నడిచినా, కొంచెం సేపు నిలబడినా కాళ్లు నొప్పి పెడతాయి. అలసట, బలహీనత క్రమంగా వస్తుంటాయి. పాదాల ఆకారంలో కూడా మార్పులు వస్తాయి. ఇక, చర్మం పెళుసుగా మారుతుంది. వాతావరణంతో సంబంధం లేకుండా పాదాలు అసాధారణంగా చల్లగా మారతాయి. కాలి గోర్లు మందంగా మారతాయి. అవి హెల్తీగా కనిపించవు.

ముఖంలో మార్పులు
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగిపోతే ముఖంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా, కళ్ల దగ్గర మచ్చలు ఏర్పడతాయి. తెలుపు, ఆరెంజ్, పసుపు పచ్చ రంగుల్లో మచ్చలు కనిపిస్తాయి. దీంతో పాటు నోటి నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. మౌత్‌ని ఫ్రెష్ చేసుకున్నా ఈ సమస్య తగ్గకపోవడం గమనించాల్సిన విషయం. ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు.

తిమ్మిర్లు
తిమ్మిర్లు ఎక్కువగా వస్తుండటం బాడీలో హై కొలెస్ట్రాల్‌ను సూచిస్తుంది. రక్తనాళాలు స్వల్పంగా బ్లాక్ కావడంతో బ్లడ్ సర్కులేషన్ సరిగా సాగదు. దీంతో కండరాల తిమ్మిర్లు వస్తుంటాయి. ముఖ్యంగా, పిరుదులు, తొడలు, మోకాళ్ల కింది కండరాలు, పాదాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి.