అరటి తిన్న తర్వాత ఈ పని చేస్తున్నారా.. అంతే ఇక సంగతులు

www.mannamweb.com


శరీరానికి తక్షణమే బలాన్నిచ్చే వాటిలో అరటి పండు ఒకటి. దీనిని రోజు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా జిమ్‌కి వెళ్లేవాళ్లు, ఎక్స్‌ర్‌సైజ్ చేసేవాళ్లు అరటి పండ్లు తింటారు. వీటిలోని పోషకాలు శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. రోజుకి కనీసం ఒక్కటి తిన్న వెంటనే బలం వస్తుంది. ఈ రోజుల్లో సహజంగా పండిన అరటి పండ్లు కంటే హైబ్రిడ్‌వి ఎక్కువగా మార్కెట్‌లో లభిస్తున్నాయి.

శరీరానికి తక్షణమే బలాన్నిచ్చే వాటిలో అరటి పండు ఒకటి. దీనిని రోజు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా జిమ్‌కి వెళ్లేవాళ్లు, ఎక్స్‌ర్‌సైజ్ చేసేవాళ్లు అరటి పండ్లు తింటారు. వీటిలోని పోషకాలు శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. రోజుకి కనీసం ఒక్కటి తిన్న వెంటనే బలం వస్తుంది. ఈ రోజుల్లో సహజంగా పండిన అరటి పండ్లు కంటే హైబ్రిడ్‌వి ఎక్కువగా మార్కెట్‌లో లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అరటి పండ్లను పరగడుపున తినకూడదని నిపుణులు అంటారు. ఏదైనా తినేసిన తర్వాత అరటి పండ్లను తినాలని నిపుణులు చెబుతుంటారు. అయితే అరటి పండ్లు తిన్న తర్వాత కొన్ని పదార్థాలను తినకూడదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా అరటి పండ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ వీటిని తిన్న తర్వాత తెలియక కొన్ని పదార్థాలను తినడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి అందకపోవడంతో పాటు అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అరటి పండ్లను తిన్న తర్వాత తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

అరటి పండ్లు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. పాలు తాగిన తర్వాత అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అరటి పండ్లు తర్వాత పాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరటి పండులోని పోషకాలు శరీరానికి అందవు. దీనివల్ల మీరు అరటి పండ్లు తిన్నా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను కూడా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అరటి పండ్లు తిన్న తర్వాత తినడం వల్ల అజీర్ణం, అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పైనాపిల్ వంటి పండ్లు కూడా తీసుకోకూడదు. ఇవి జీర్ణం కాక కొన్నిసార్లు వాంతులకు కూడా కారణమయ్యేలా చేస్తాయి.

అరటి పండ్లు తిన్న తర్వాత స్వీట్లు కూడా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. తీపి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అరటి తర్వాత తీపి పదార్థాలను తినడం మానుకోండి. అరటి పండ్లు తిన్న తర్వాత వీటిని తినడం వల్ల మలబద్ధకం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అరటి పండును ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్న సమయంలో తినడం ఆరోగ్యానికి మంచిది. అరటి పండ్లు వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. ఇందులోని పోషకాలు అన్ని అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. తినాల్సిన పద్ధతిలో తింటేనే వీటి వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.