బ్యాకులో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది..
పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 16 వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్టుల గురించి అర్హతలు, జీతం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్: 484 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్- 76,లక్నో-78,ఢిల్లీ-76, భోపాల్- 38, కోల్‌కతా- 2, ఎంఎంజడ్‌వో & పుణె- 118, పట్నా- 96..
అర్హతలు..
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా స్థానిక భాషపై కూడా పరిజ్ఞానం ఉండాలి..
వయస్సు..
31.03.2023 నాటికి 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది..
వేతనం..
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.14,500- రూ.28145..
ఎంపిక ప్రక్రియ..
ఆన్‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు..
అప్లికేషన్ ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850..
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 20.12.2023.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 16.01.2024.
ఆన్‌లైన్ పరీక్ష: ఫిబ్రవరి 2024.
పరీక్ష ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 2024..
ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..