దేశవ్యాప్తంగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ఆగస్టు 25 నుండి 31వ తేదీ వరకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి.
మీరు కూడా పని కోసం బ్యాంకుకు వెళ్లాలని ఆలోచిస్తుంటే ఈ జాబితాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకులు ఏ తేదీలలో మూసివేసి ఉంటాయో తెలుసుకుందాం. వచ్చే వారం నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. అయితే ఈ సెలవులు నగరం, రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయని గమనించండి.
25న బ్యాంకులకు సెలవు:
ఆగస్టు 25, సోమవారం వారంలో మొదటి రోజు బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ రోజు గౌహతిలో ఏ బ్యాంకులు తెరిచి ఉండవు. మహాపురుష శ్రీమంత శంకరదేవ వర్ధంతి సందర్భంగా బ్యాంకులు సెలవు.
ఆగస్టు 27-2 తేదీలలో..
ఆగస్టు 27 బుధవారం గణేష్ చతుర్థి సందర్భంగా అనేక రాష్ట్రాలు, నగరాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. వీటిలో ముంబై, బేలాపూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, పనాజీ ఉన్నాయి. ఇతర నగరాల్లోని బ్యాంకులు యథావిధిగా తెరిచి ఉంటాయి. ఆగస్టు 28 గురువారం గణేష్ చతుర్థి సందర్భంగా భువనేశ్వర్, అలాగే పనాజీలలో బ్యాంకులు మూసి ఉంటాయి. కానీ మిగిలిన నగరాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఆగస్టు 31న..
అదే సమయంలో ఆగస్టు 31 ఆదివారం వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సర్క్యులర్ ప్రకారం.. సాధారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు ఆదివారాలు సెలవు ఉంటుంది. దీని ప్రకారం.. ఆగస్టులో ఆదివారం బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే, బ్యాంకులు మూసివేసే రోజుల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఆన్‌లైన్ సేవలు అందుబాటులో..
ఈ వారం నాలుగు రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. కానీ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ATMలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
































