వినియోగదారులకు అలర్ట్‌.. వచ్చే వారం నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌

ప్రతి నెల బ్యాంకుల సెలవులను ఖరారు చేస్తుంటుంది రిజర్వ్‌ బ్యాంక్‌. ఏయే రోజుల్లో ఎలాంటి సెలవులు ఉంటాయో ప్రకటిస్తుంటుంది. అలాగే వచ్చే వారం నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.


అటువంటి పరిస్థితిలో మీరు మీ పని పూర్తి చేసుకోవడానికి బ్యాంకు శాఖకు వెళ్లవలసి వస్తే ఈ వారం శుక్రవారం వెళ్లి మీ పని పూర్తి చేసుకోవచ్చు. ఆగస్టు 25 సోమవారం నుండి 31 వరకు వారంలో నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. సోమవారం, బుధవారం, గురువారం బ్యాంకులకు సెలవు. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చని గమనించండి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి మూసి ఉంటాయి.

ఆగస్టు 2025 సెలవుల జాబితా

  • ఆగస్టు 25 (సోమవారం) – శ్రీమంత శంకరదేవ తిరుభవ తిథి – గౌహతిలో మాత్రమే సెలవు
  • ఆగస్టు 27 (బుధవారం) – గణేష్ చతుర్థి / గణేష్ పూజ – ముంబై, నాగ్‌పూర్, చెన్నై, హైదరాబాద్ మొదలైన నగరాల్లో సెలవు.
  • ఆగస్టు 28 (గురువారం) – గణేష్ చతుర్థి (రెండవ రోజు) / నువాఖై – భువనేశ్వర్, పనాజీలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • ఆగస్టు 31 (ఆదివారం) – ఆదివారం కారణంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో..

బ్యాంకు సెలవు దినాలలో మీరు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. కానీ చెక్ క్లియరింగ్, డ్రాఫ్ట్ తయారీ వంటి సేవలు పొందలేరు. మీరు ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పనిని పరిష్కరించాల్సి వస్తే, ఈ తేదీలకు ముందు లేదా తరువాత ప్లాన్ చేసుకోండి. సెలవు దినాలలో డిజిటల్ లావాదేవీలు సాధ్యమవుతాయి. కానీ శాఖలో అందుబాటులో ఉన్న సేవ అందుబాటులో ఉండదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.