ఈ రాష్ట్రాల్లో సెప్టెంబర్ 13 నుండి 18 వరకు బ్యాంకులు క్లోజ్‌

www.mannamweb.com


మీకు ఏదైనా బ్యాంకు సంబంధిత పని ఉంటే ఇది మీకు ముఖ్యమైన వార్త. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం.. ఈ వారం ప్రాంతీయ సెలవులు, పండుగలు, వారాంతాలతో సహా సుదీర్ఘ సెలవులు ఉన్నాయి.

వివిధ రాష్ట్రాల్లోని కొన్ని బ్యాంకులు సెప్టెంబర్ 13-18 మధ్య వరుసగా ఆరు రోజుల పాటు మూతపడవచ్చు. కానీ అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుల జాబితా భిన్నంగా ఉంటుందని గుర్తించుకోండి.

ప్రతి నెలా, ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాంకు సెలవుల పూర్తి జాబితా అందిస్తుంది. ఇది రాష్ట్రాల ప్రకారం.. వివిధ పండుగలు, సెలవుల పూర్తి వివరాలను కలిగి ఉంది. ఇది కాకుండా రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేసి ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. అటువంటి పరిస్థితిలో మీకు రాబోయే రోజుల్లో ఏదైనా బ్యాంకు సంబంధిత పని ఉంటే, అప్పుడు సెలవుల జాబితాను తనిఖీ చేయండి. తద్వారా మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.

సెలవుల జాబితా:

☛ సెప్టెంబర్ 13 – రామ్‌దేవ్ జయంతి – (రాజస్థాన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి)

☛ సెప్టెంబర్ 14: రెండవ శనివారం, ఓనం (కొచ్చి, రాంచీ, తిరువనంతపురం)

☛ సెప్టెంబర్ 15: ఆదివారం (భారతదేశం అంతటా)

☛ సెప్టెంబర్ 16: సోమవారం – ఈద్-ఎ-మిలాద్ (భారతదేశం అంతటా)

☛ సెప్టెంబర్ 17: మంగళవారం – ఇంద్ర యాత్ర (సిక్కిం)

☛ సెప్టెంబర్ 18: బుధవారం – శ్రీ నారాయణ గురు జయంతి (గ్యాంగ్‌టక్)

ఇవి కాకుండా, కొన్ని రాష్ట్రాలు వచ్చే వారం 21 సెప్టెంబర్ (శ్రీ నారాయణ గురు సమాధి – కేరళ), 22 సెప్టెంబర్ (ఆదివారం – అఖిల భారతం), 23 సెప్టెంబర్ (వీరుల అమరవీరుల దినోత్సవం – హర్యానా) సెలవులతో లాంగ్ వీకెండ్‌ను పొందుతున్నాయి. నెలాఖరులో 28 నాల్గవ శనివారం, 29 ఆదివారం సెలవులు.