పెళ్లైన వారానికే బర్రెలక్క ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరిగింది?

సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. యూట్యూబ్ వీడియోలు, టిక్ టాక్, రీల్స్ లాంటివి చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. పాటలు, డైలాగ్స్, డ్యాన్సులు, ఒళ్లు జలదరించే సాహసాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తెలంగాణలోని పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ‘ఎంత చదివినా నోటిఫికేషన్లు లేవు ఫ్రెండ్స్.. అందుకే బర్రెలు కొని కాస్తున్నా’ అంటూ చెప్పిన డైలాగ్ ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చింది. సోషల్ మీడియాలో ఆమె ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్‌గా మారింది. అంతేకాదు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లా పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి పాపులర్ అయ్యింది. ఈ మధ్యనే వివాహబంధంలోకి అడుగు పెట్టింది బర్రెలక్క. అయితే పెళ్లైన వారం రోజులకే ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఒకే ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత చిన్న చిన్న రీల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించింది బర్రెలక్క. అంతేకాదు గత ఏడాది చివర్లో తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. ఆ సమయంలో తాను గెలిస్తే నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతా అని చెప్పుకొచ్చింది. కానీ పోటీలో ఓడిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ తో పెళ్లి అంటూ మళ్లీ వార్తల్లో నిలిచింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తూ.. స్వయంగా తన పెళ్లి గురించి ప్రకటించింది. వారం రోజుల క్రితం సమీన బంధువు వెంకటేశ్ తో కలిసి ఏడు అడుగులు వేసింది. ఇదిలా ఉంటే తాజాగా బర్రెలక్క ఓ ఎమోషనల్ పోస్ట్ నెట్టింట్ వైరల్ అవుతుంది.

బర్రెలక్క తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చేసిన పోస్ట్ ‘ ఒక అమ్మాయికి గాయం అయితే.. గాయం చేసిన వాళ్లను ఏమీ అనరు.. అదే గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారు. అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి ఉండదు.. మంచోళ్లు ఉన్నారు, చెడ్డోళ్లు ఉన్నారు. ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలనే ఆలోచన రాదు. ఒక అమ్మాయి దాక్కునే పరిస్థితి రాదు. తప్పు చేసిన వాళ్లు బయట బాగానే ఉన్నారు.. ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారు’ అంటూ రాసుకొచ్చింది. అదేంటీ పెళ్లైన వారం రోజులకే బర్రెలక్క ఈ రేంజ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అంటూ రక రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. మరి నెటిజన్ల స్పందనపై బర్రెలక్క ఏ విధంగా రిప్లై ఇస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *