Bats : గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేలాడతాయి..? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!

Bats : గబ్బిలాలు ఒక ప్రత్యేకమైన జీవి. ఇది క్షీరద జాతికి చెందినది. ఈ జాతిలో ఎగరగలిగే ఏకైక జీవి గబ్బిలం. చాలా మందికి గబ్బిలాల వల్ల వైరస్‌లు వ్యాప్తి చెందుతాయని మాత్రమే తెలుసు.
కానీ గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయో తెలుసా..? గబ్బిలాలను ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన జీవిగా ఎందుకు చెబుతారు..? గబ్బిలాల గురించి ఎప్పుడూ వినని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


గబ్బిలాలు మిగిలిన పక్షుల్లా నడవలేవు, నిలబడలేవు. వీటికి ఎగరడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. గబ్బిలాలు ఎక్కడైనా నిలవాలంటే వాటి రెక్కలకి ఉన్న గోళ్లతో చెట్టుకొమ్మనో లేదా గోడ పగులునో పట్టుకుని తలకిందులుగా వేలాడుతాయి. ఇవి వేటకు వెళ్లేప్పుడు వాటి పిల్లలను పొట్టకి కరుచుకొని ఎగురుతాయి.

గబ్బిలాలకు ఇతర పక్షులకు చాలా తేడా ఉంటుంది. గబ్బిలాలు భూమిపై నుంచి పరుగెత్తలేవు. అలానే ఎగురలేవు.. ఎందుకంటే వాటి రెక్కలు తగినంత లిఫ్ట్‌ను ఇవ్వవు. వాటి వెనుక కాళ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. గబ్బిలాలకు ఈకలు ఉండవు. వీటి వేళ్ల మధ్యన గొడుగు బట్టలాగా సాగదీసిన చర్మంతో చేసిన రెక్కలు ఉంటాయి. గబ్బిలం వేళ్లలో బొటనవేలు తప్ప మిగిలిన వేళ్లు గొడుడు ఊచల్లా పనిచేస్తాయి. ఈ బొటన వేలు పైకి పొడుచుకు వచ్చిట్లుగా ఉంటుంది. చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడేందుకు ఈ వేలు సహకరిస్తుంది. తలక్రిందులుగా వేలాడడం ద్వారా గబ్బిలాలు చాలా సులభంగా ఎగురుతాయి.

అయితే గబ్బిలాలు ఎప్పుడు కూడా తలకిందులుగా నిద్రపోతుంటాయి. అందువల్ల గబ్బిలాలకు ఉండే కండరాలు ప్రత్యేక నిర్మాణంలో ఉంటాయి. గబ్బిలాల వెనుక పాదాలుకండరాలుకు ఎదురుగా పనిచేస్తాయి. గబ్బిలాలు వేలాడుతున్నప్పుడు ఎటువంటి శక్తిని ప్రయోగించవు. వేలాడుతున్నప్పుడు అవి చాలా విశ్రాంతిగా ఉంటాయి.

మీరు గమనించినట్లయితే మనిషి తలక్రిందులుగా వేలాడినప్పుడు తలకు రక్తప్రసరణ ఆగిపోతుంది. కానీ గబ్బిలాల విషయంలో అలా జరగదు. వేలాడుతున్న వాటికి రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. గబ్బిలాలు చాలా తేలికగా ఉంటాయి. అందువలనే వాటికి గురుత్వాకర్షణ, రక్తప్రసరణలో పెద్ద సమస్య ఉండదు. దీని కారణంగా గబ్బిలాలు తలకిందులుగా ఉండగులుగుతాయి. గబ్బిల చనిపోయిన తర్వాత కూడా తలకిందులుగానే ఉంటాయి.

గబ్బిలాలు డైనోసార్ల యుగం కంటే ముందు నుంచే ఉన్నాయి. ఇవి అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్న ఎడారులలో కూడా జీవిస్తాయి. గబ్బిలాల నిర్మాణం కూడా పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని గబ్బిలాల బొచ్చు అంగోరా లాగా ఉంటుంది. ఇండోనేషియాలో కనిపించే గబ్బిలం తన రెక్కలను 6 అడుగుల వరకు విస్తరించగలదు. థాయిలాండ్‌కు చెందిన బంబుల్బీ గబ్బిలాల అతి తక్కువ బరువు కలిగి ఉంటాయి. లాటిన్ అమెరికాలో కనిపించే 70 శాతం గబ్బిలాలు రక్తం మాత్రమే తాగుతాయి.