ఆడవారికి వెంట్రుకలు చాలా అందం. మగవారికి గడ్డం, మీసం అందం.వారికి జుట్టు, మీసాలు, గడ్డం మంచి రంగుతో ఉంటే చూడటానికి అట్రాక్టివ్ గా కనిపిస్తుంటారు.
మరీ ఎక్కువగా ఉన్నా కూడా బాగోదు. అయితే కేవలం మీ గడ్డం మీసం నల్లగా ఉంటే మాత్రమే బాగుంటుంది. కాస్త తెల్ల రంగులోకి వస్తే మాత్రం ఇక అంతే సంగతులు. ఒక వెంట్రుక తెల్లరంగులో మారినా సరే మిగిలిన వెంట్రుకలు తెల్లగా మారడానికి పెద్దగా సమయం పట్టదు. అయితే మీ తెల్లని గడ్డం, వెంట్రుకలను నల్లగా మార్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే టెన్షన్ అవసరం లేదు. జస్ట్ కొన్ని రెమెడీలు ఉపయోగిస్తే సరిపోతుంది త్వరలోనే మీకు మంచి రంగు వస్తుంది.
కాలుష్యం, కల్తీ ఆహారం, స్ట్రెస్ ల వల్ల చాలా తక్కువ వయసులోనే ముఖ్యంగా 30 ఏళ్లకే గడ్డం తెల్లగా అవుతుంది. కానీ ఇలా మారిందని చింతించాల్సిన అవసరం లేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే మీ తెల్ల గడ్డం నల్లగా మారుతుంది. అదే విధంగా ఎలాంటి నష్టం కూడా ఉండదు. మరి అవేంటి అంటే?
కొబ్బరి నూనె, ఉసిరికాయ జ్యూస్ మీకు మంచి ప్రయోజనాలను అందిస్తుంది. అయితే మీ జుట్టు తెల్లగా మారడానికి కారణం మెలనిన్ అనే పిగ్మెంట్ లోపించడమే అంటున్నారు నిపుణులు. ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్ ని ఒక కప్ కొబ్బరి నూనెలో కలిపి కలపాలి. ఆ తర్వాత బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఒక 3-4 గంటలు ఉండనిచ్చి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వారానికి ఒక సారి ఇలా చేస్తే గడ్డం లో ఉన్న తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. ఇక వీటితో పాటు కొబ్బరి నూనె, కరివేపాకు కూడా మంచి ఫలితాలను అందిస్తాయి.
రెండు కప్పుల కొబ్బరి నూనెలో ఒక కప్పు కరివేపాకు వేయాలి. ఆ కరివేపాకు నల్లగా అయ్యే వరకు కూడా అదే విధంగా వేడి చేయాలి. ఈ నూనెను గడ్డానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ గడ్డం సహజంగా నల్లగా మారుతుంది. ఉల్లిపాయ రసం కూడా మీ జుట్టును నల్లగా మారుతుంది. ఒక ఉల్లిపాయను మిక్సీ వేయాలి. దీని ద్వారా వచ్చిన జ్యూస్ ని తీసుకొని గడ్డానికి రాసి ఒక 15-20 నిమిషాలు ఉండనివ్వాలి. ఇలా రెగ్యులర్ గా వినియోగిస్తే తెల్లగా మారిన గడ్డం నల్లగా అవుతుంది.
మెంతులు కూడా మంచి ఔషధం. అయితే ఒక గుప్పెడు మెంతులని నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. వీటిని పొద్దున్నే పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని గడ్డానికి రాసి 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ చిట్కాను వారానికి 2-3 సార్లు పాటించడం వల్ల మీ తెల్ల గడ్డం నల్లగా మారుతుంది. నీలి ఆకులను కూడా మీరు ఉపయోగించవచ్చు. ఈ ఇండిగో ఆకులను కొబ్బరి నూనెలో వేసి సన్నని సెగ మీద బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టాలి. ఒక బాటిల్ లో పోసి పక్కన పెట్టుకోండి. వారానికి ఒక సారి గడ్డానికి మసాజ్ చేయడం వల్ల మీ తెల్ల గడ్డం నల్లగా మారి మంచి యంగ్ లుక్ ను అందిస్తుంది.