Beetroot With Ginger : ఇవి రెండూ చాలు.. మీ లివర్‌, రక్త నాళాలు అన్నీ కడిగేసినట్లు క్లీన్ అవుతాయి..!

Beetroot With Ginger : మనకు సులభంగా లభించే పదార్థాలతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఈ జ్యూస్ ను తాగడం వల్ల కాలేయంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం శుభ్రపడుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. రక్తం శుభ్రపడుతుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉండే ఉప్పు తొలగిపోతుంది. శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ జ్యూస్ ను తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.


మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం బీట్ రూట్ ను, క్యారెట్ ను, గుప్పెడు కొత్తిమీరను, రెండు ఇంచుల అల్లం ముక్కను, ఒక టమాట కాయను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం బీట్ రూట్ పై ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ ను, టమాటాను, అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో బీట్ రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే కొత్తిమీర, అల్లం, టమాట ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి దీని నుండి జ్యూస్ ను తీసుకోవాలి.

Beetroot With Ginger

ఈ జ్యూస్ ను ఇలాగే నేరుగా తాగవచ్చు లేదా రచి కొరకు నిమ్మరసం, కొద్దిగా తేనె కూడా కలుపుకుని తాగవచ్చు. ఈ విధంగా జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఈ జ్యూస్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ నశించి మనం క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యల బారిన కూడా పడకుండా ఉంటాము.