వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులకు ఇటీవలే కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటికే ఇల్లంతా ఆడ పిల్లలతోనే నిండిపోవడంతో?
ఒక బాబు ఉంటే బాగుండని చిరంజీవి కోరుకున్న నేపథ్యంలో వరుణ్-లావణ్య దంపతులు ఆ కోరిక తీర్చేసారు. రామ్ చరణ్- ఉపాసన దంపతులకు కూడా ఓ మగబిడ్డ జన్మిస్తే చిరంజీవి ఇంకా సంతోషంగా ఉంటారు. మెగా వారసత్వాన్ని మనవడి రూపంలో చూసుకోవాలని చిరంజీవి ఎంతో ఆశపడుతున్నారు. ఆసంగతి పక్కన బెడితే! నిహారిక మాత్రం మేనల్డుడు విషయంలో ఎంతో సంతోషంగా ఉంది.
అన్నయ్య కొడుకుతో నిహారిక ఆటలు:
మేనల్లుడు రాకతో ఇంట్లో తనని ఎవరూ ఏమీ అనలేదని..ఎలాంటి పనులు చెప్పడం లేదని తెలిపింది. సమయ మంతా బుడ్డొడితోనే గడుపుతున్నట్లు తెలిపింది. మనవడు రాకముందు అమ్మా-నాన్నలు ఏదో పనిచేప్పేవారని కానీ ఇప్పుడా పనులేవి చెప్పడం లేదని తెలిపింది. బాబును ఎత్తుకోవడంతోనే కాలక్షేపం అవుతుందంది. అలాగే నిహారిక మేనల్లుడితో ఇప్పుడే అగ్రిమెంట్ కూడా రాసేసుకుంది. మేనల్లుడు పెరిగి పెద్దాయ్యాక తాను సినిమాల్లోకి వస్తానంటే మాత్రం తొలి సినిమా తన సొంత బ్యానర్లోనే నిర్మించి పరిశ్రమకు పరిచయం చేస్తానంది.
నటిగా, నిర్మాతగా బిజీ:
అలాగే తానిప్పుడు తల్లిదండ్రులతో కాకుండా సపరేట్ గా ఉంటున్నట్లు తెలిపింది. అలాగని కుటుంబానికి దూరం కాలేదు. రెండు..మూడు రోజులకు ఒకసారి ఇంటికొచ్చి వెళ్తున్నట్లు తెలిపింది. ఫ్యామి లీతో ఉన్న సమయంలో ఒత్తిడంతా ఎగిరిపోతుందని…రీఫ్రెష్ అవ్వాలంటే అమ్మానాన్నల దగ్గరే ఉండాలంటోంది. అలాగే తెలుగులో ఓ మంచి సినిమాలో అవకాశం వస్తే హీరోయిన్ గా చేయాలని ఉందని ఓపెన్ అయింది. ప్రస్తుతం నిహారిక తమిళ్ లో ఓ సినిమా చేస్తోంది. నటనతో పాటు నిర్మాతగానూ సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది.
కుటుంబంలోనే కావాల్సినంత మంది:
అయితే నిహారికలో ఈ వేగం సరిపోదు. నటిగా, నిర్మాతగా ఏడాదికి నాలుగైదు సినిమాలైనా చేయాలి. హీరోల కోసం ప్రత్యేకంగా తాను వెతుక్కోవాల్సిన పనిలేదు. ఇంట్లోనే కావాల్సినంత మంది హీరోలున్నారు. సొంత అన్నయ్య వరుణ్ తేజ్ ఉన్నాడు. తనతో ఇంకా సినిమా నిర్మించలేదు. అలాగే సాయితేజ్, వైష్ణవ్ తేజ్ ల్ని అడిగితే డేట్లు ఇవ్వరా? మరో అడుగు ముందుకేసి చరణ్ అన్నయ్య దగ్గరకు వెళ్తే కాదంటాడా? కానీ నిహారిక మాత్రం అలాంటి ప్రయత్నాలు ఇంకా చేయలేదు.
































