మినపప్పుతో ఎంత ఆరోగ్యమో తెలుసా..? మధుమేహం రోగులకు బెస్ట్ ఫుడ్

www.mannamweb.com


ఆయుర్వేదవైద్యంలో ఆస్తమా, పక్షవాతం, ఆర్థరైటిస్, వంటి వ్యాధుల నివారణలో కూడా ఈ పప్పును వాడుతారు. ఈ పప్పులో ప్రోటీన్లు, విటమిన్ బీ పుష్కలంగా లభిస్తాయి.

మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలనుంచి బయటపడొచ్చు. డయాబెటిస్ రోగులకే కాదు అందరికీ ఇది మంచి బలవర్ధకమైన ఆహారం. ఇందులో ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కిడ్నీల సంరక్షణలో మినపప్పు అద్భుతంగా పనిచేస్తుంది.

డయాబెటిస్ రోగులకు ముఖ్యంగా కావాల్సింది హెల్తీ డైట్. అంటే ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తప్పకుండా తీసుకోవాలి. ప్రోటీన్ అండ్ ఫైబర్ ఆధారిత ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా మినపప్పు ఇందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. పప్పు గట్‌ హెల్త్‌ ను మెరుగుపరిచి, శరీరంలోని ఐరన్‌ లెవల్స్‌ ను పెంచేందుకు సహకరిస్తుంది. గుండెను ఆరోగ్యంగా, దృడంగా ఉంచుతుంది.

నాడీ బలహీనత, పాక్షిక పక్షవాతం, ముఖ పక్షవాతం, ఇతర రుగ్మతల నివారణకు వివిధ ఆయుర్వేద ఔషధాలలో మినపప్పును ఉపయోగిస్తారు. మధుమేహం ఉన్నవారికి కూడా మంచిది. మినపప్పు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. మినపప్పులో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, ఐరన, ఫోలేట్, కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. మినపపప్పులో రెండు రకాలుంటాయి. ఇందులో తొక్కతో ఉన్నవి తింటే మరింత ప్రయోజనకరం.

ముఖ్యంగా మహిళల సౌందర్యపోషణ విషయంలో మినపప్పు ద్వారా అనేకరకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో మినరల్స్ , విటమిన్స్, పుష్కలంగా ఉంటాయి. ఇవి సన్ టాన్స్ ను తొలగిస్తాయి. ఆరోగ్యవంతమైన, జుట్టుకు మినపప్పులో ఉండే పోషకాలు ఎంతగానో మేలు చేస్తాయి. బరువు తగ్గించడంలో మినప పప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది.

మొటిమల సమస్యతో బాధపడేవారు మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తగా నూరిన మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకుని, ఆ తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాదు పురుషుల లైంగిక సమస్యలను తొలగించడంలో మినపప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది.