ఇంటర్ అర్హతతో బెస్ట్ Govt Jobs.. ఇంకా కొన్ని రోజులే ఛాన్స్

www.mannamweb.com


ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. జాబ్ సెర్చ్ లో ఉన్నవారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇంటర్ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి కొన్ని రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. వెంటనే అప్లై చేసుకోండి. ఎస్ఎస్సి స్టెనో గ్రేడ్ సీ,డీ ఎగ్జామినేషన్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో గ్రేడ్ సీ, డీ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2006 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 17 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు సీబీటీ టెస్ట్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన సమాచారం :
విద్యార్హత :

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సీ’: 2024 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డీ’: ఆగస్టు 1, 2024 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

అప్లికేషన్ ఫీజు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ (ఈఎస్ ఎం)లకు చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తులు ప్రారంభ తేది:

26-07-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

17-08-2024