మార్కెట్లో ఎన్ని పెట్టుబడి ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మందికి బెస్ట్ ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డీ). ముఖ్యంగా రిస్క్అస్సలు వద్దు అనుకునే వారికి, సీనియర్ సిటిజెన్స్(వృద్ధులు)కు.
వీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్‌పై స్థిర ఆదాయాన్ని కోరుకుంటారు. స్థిర వడ్డీతో పాటు కచ్చితమైన రాబడి కావాలనుకుంటారు. అందుకే వీటిల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రధానంగా వృద్దులు తమ రిటైర్మెంట్ ఫండ్ నుంచో లేక ఇతర పథకాల్లో వచ్చిన ఫండ్‌ను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు మార్కెట్ ఒడిదొడుకులకు లోను కాదు కాబట్టి. మీకు రాబడిలో ఎలాంటి నష్టం ఉండదు. వృద్దులు ఇలాంటి పథకాల వైపే మొగ్గుచూపుతుంటారు. వీరిని ఆకర్షించేందుకు బ్యాంకర్లు కూడా పోటీ పడుతున్నారు. సీనియర్ సిటిజెన్స్‌కు అధిక వడ్డీతో పాటు పలు ప్రయోజనాలను అందిస్తున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పాటు పలు ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాగా ఈ ఆగస్టులో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను బ్యాంకులు సవరించాయి.
కొత్త వడ్డీ రేట్లు ఇవి..
సీనియర్ సిటిజెన్స్‌కు అన్ని బ్యాంకుల్లోనూ మంచి వడ్డీ రేట్లు అమలు చేస్తున్నాయి. అయితే నిర్ణీత కాల వ్యవధుల్లోనే ఆ వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. 80ఏళ్లు పైబడిన వృద్దులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే వారికి అందించే వడ్డీ రేట్లు వివరాలు మీకు అందిస్తున్నాం. వీటిల్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పాటు పలు ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల వివరాలు ఉన్నాయి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు..
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో అత్యధిక వడ్డీ 8.5%, ఇది 18 నెలలు కాలవ్యవధితో కూడిన ఎఫ్డీపై వస్తుంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో అత్యధిక వడ్డీ 9%, 444 రోజుల వ్యవధితో కూడిన ఎఫ్డీపై అందిస్తోంది.
ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలలోపు వ్యవధి ఉండే ఎఫ్డీలపై అత్యధికంగా 8.75% వడ్డీ అందిస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 365 రోజుల నుంచి 1095 రోజుల లోపు ఉండే డిపాజిట్లపై అత్యధికంగా 8.75% వడ్డీ వస్తుంది.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 546 రోజుల నుంచి 1111 రోజుల వరకు ఉండే ఎఫ్డీలపై 9.5% వడ్డీ రేటు వస్తుంది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే ఎక్కువ డిపాజిట్లపై 9.1% వడ్డీ రేటు వస్తుంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 12 నెలలు 8.75% వడ్డీ ఇస్తుంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1001 రోజుల ఎఫ్డీపై 9.5% వడ్డీ ఇస్తుంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలలోపు ఉండే ఎఫ్డీపై 9.1% వడ్డీ అందిస్తుంది.
ప్రైవేట్ రంగ బ్యాంకులు..
యాక్సిస్ బ్యాంక్‌లో 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే డిపాజిట్లపై 7.75% వడ్డీ రేటు అందిస్తోంది.
బంధన్ బ్యాంక్‌లో 1 సంవత్సరం 9 నెలల ఎఫ్డీపై8.5% వడ్డీ వస్తుంది.
సిటీ యూనియన్ బ్యాంక్ 400 రోజుల ఎఫ్డీపై 7.75% వడ్డీ ఇస్తోంది.
సీఎస్బీ బ్యాంక్ 401 రోజుల ఎఫ్డీపై 7.75% ఇస్తోంది.
ఫెడరల్ బ్యాంక్ 50 నెలలు; 777 రోజుల ఎఫ్డీలపై 7.9% శాతం వడ్డీ అందిస్తోంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో, 4 ఏళ్ల 7 నెలలు (55 నెలలు) వ్యవధితో కూడిని ఎఫ్డీపై 7.9% వడ్డీ ఇస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్‌లో 15 నెలల నుంచి 18 నెలలలోపు ఎఫ్డీపై 7.8% కంటే తక్కువ వడ్డీని అందిస్తోంది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 500 రోజుల డిపాజిట్లపై 8.25% వడ్డీని అందిస్తోంది.
ఇండస్ఇండ్ బ్యాంక్ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఉండే ఎఫ్డీపై 8.25% వడ్డీని అందిస్తోంది.
పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు..
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 399 రోజుల ఎఫ్డీపై 7.75% వడ్డీ రేటు లభిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 666 రోజుల ఎఫ్డీపై 7.8% వడ్డీని అందిస్తోంది.
కెనరా బ్యాంక్ 777 రోజుల ఎఫ్డీపై 7.75% వడ్డీని అందిస్తోంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 444 రోజుల ఎఫ్డీపై 7.95% వడ్డీని అందిస్తోంది.
ఇండియన్ బ్యాంక్, 444రోజుల ఎఫ్డీపై 7.75% వడ్డీని అందిస్తోంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 400 రోజుల ఎఫ్డీపై 7.8% వడ్డీని అందిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 400 రోజుల ఎఫ్డీపై 7.75% వడ్డీని అందిస్తోంది.
పంజాబ్ & సింధ్ బ్యాంక్ 666 రోజుల ఎఫ్డీపై 7.8% వడ్డీని అందిస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజుల ఎఫ్డీపై 7.75% వడ్డీని అందిస్తోంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 333 రోజుల ఎఫ్డీపై 7.9% వడ్డీని అందిస్తోంది.