డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కు రోజు రోజుకి బాగా క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీ లోకి కొత్త సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. పైగా వాటిలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం విశేషం. ఇక ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సినిమాలను ప్రేక్షకులు ఎలాగూ మిస్ చేయకుండా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీస్ ను మిస్ చేస్తూ ఉంటారు. వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ తెలుగు సినిమా గురించే మరి ఈ సినిమా ఏంటి ఏక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమాను మీరు చూసారో లేదో.. ఓసారి చెక్ చేసేయండి.
ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం. ఈ సినిమా అంతా కూడా.. అంధుడైన సూర్యం, క్రికెట్ కోచ్ వినోద్, సైకాలజిస్ట్ డాక్టర్ ఇంద్రన్ అనే మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. సూర్యం ఓ గవర్నమెంట్ లైబ్రరీలో క్లర్క్ గా పని చేస్తూ ఉంటాడు. అలాగే తనకున్న బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. వినోద్ బాగా డిప్రెషన్ లో ఉంటాడు. మరో వైపు డాక్టర్ ఇంద్రాన్ తన పేషంట్ ను గన్ తో షూట్ చేసి… తానూ కూడా సూసైడ్ చేసుకుని చనిపోదాం అని అనుకుంటాడు. కానీ ఆ బులెట్ ఇంద్రన్ గొంతులో నుంచి వెళ్లడంతో వోకల్ దెబ్బతిని.. ప్రాణాలతో బయటపడతాడు. అసలు ఈ ముగ్గురికి సంబంధం ఏంటి ? ఇంద్రన్ తన పేషంట్స్ కు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు ? వినోద్ డిప్రెషన్ లోకి వెళ్లడానికి రీజన్ ఏంటి ? అసలు ఈ ముగ్గురు చుట్టూ తిరిగే కథ ఏమై ఉంటుంది ? ఇవన్నీ చెప్పడం కంటే కూడా చూస్తూనే మంచి కిక్ ఉంటుంది. ఈ సినిమా పేరు ‘అంధకారం’ అనే ఈ సినిమాను చూడాల్సిందే.
ఇదొక డిఫరెంట్ సైకలాజికల్ హర్రర్ మూవీ.. 2020 లో వచ్చిన తమిళ మూవీ అంధగారం సినిమాను.. తెలుగులో అంధకారం పేరుతో రూపొందించారు. సాధారణంగా సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్స్ అంటే కచ్చితంగా బ్రెయిన్ కు పని చెప్పాల్సిందే. ఈ మూవీ కూడా అలాంటిదే.. ఈ సినిమా చివరి వరకు కూడా.. ఎంగేజింగ్ గా ఉంచుతుంది. ఇలాంటి సినిమాను మిస్ చేసి ఉంటే మాత్రం ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. పైగా తెలుగులో ఉంది కాబట్టి అసలు మిస్ చేయకండి.