హాట్ స్టార్ లో ఉన్న బెస్ట్ స్పైన్ చిల్లింగ్ థ్రిల్లింగ్ సినిమాలు ఇవే

www.mannamweb.com


సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను మూవీ లవర్స్ ఎక్కువగా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ సినిమాలు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తాయి.

థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిలో థ్రిల్లర్ సినిమాలు కూడా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను చూసేద్దాం పదండి.

ఫ్రెడ్డీ (Freddy)

ఫ్రెడ్డీ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కి శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించరు. 2022 వచ్చిన హిందీ భాషా సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. ఈ మూవీని ఏక్తా కపూర్, జే శేవక్రమణి నిర్మించారు. కార్తీక్ ఆర్యన్, అలయ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ డిసెంబర్ 2, 2022న డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఒక దంత వైద్యుడు ఒక మహిళతో ప్రేమలో పడి, ఆమెతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే సన్నివేశాలతో ఈ మూవీ స్టోరీ రన్ అవుతుంది. వీరి జీవితంలో జరగే సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

పార్కింగ్ (Parking)

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 2023 లో తమిళంలో రిలీజ్ అయింది. ప్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై సుధన్ సుందరం, కెఎస్ సినీష్ నిర్మించరు. ఈ సినిమాకు రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈశ్వర్ అనే ఐటి ఉద్యోగి, ప్రెగ్నెంట్ గా ఉండే తన భార్యతో హ్యాపీగా ఉంటాడు. కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత అందులో పార్కింగ్ కి సంబంధించిన సమస్యలతో వీరి జీవితం అనుకోని మలుపులు జరుగుతుంది. ఈ మూవీ ఆసక్తికర సన్నివేశాలతో ప్రేక్షకులను ఆ కట్టుకుంటుంది. ఈ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.

కాఫీ (Copy)

ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఆరిందమ్ సీల్ దర్శకత్వం వహించాడు. విక్రాంత్, సర్వీన్ చావ్లా, అనుప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక వ్యక్తి భార్యతో పాటు ప్రియురాలిని కూడా, ఎవరికీ డౌట్ రాకుండా మెయింటైన్ చేయడానికి ఒక రోబోని సృష్టిస్తాడు. అయితే ఆ రోబో వల్ల ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్యలతో ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ రన్ అవుతుంది. ఈ థ్రిల్లర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.

కట్‌పుట్ల్లి (Cuttputli)

ఈ క్రైమె సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి రంజిత్ ఎం. తివారీ దర్శకత్వం వహించారు. 2022 లో వచ్చిన హిందీ భాషా సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కట్‌పుట్ల్లి. వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్‌శిఖా దేశ్‌ముఖ్ ఈ మూవీని నిర్మించారు. రామ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, జాషువా లెక్లైర్, చంద్రచూర్ సింగ్, సర్గున్ మెహతా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney + hotstar) లో సెప్టెంబర్ 2, 2022 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఒక చిన్న పట్టణంలో జరిగే హత్యలు అక్కడ ప్రజలను కంగారుపెడుతూ ఉంటాయి. దీనికి సంబంధించి నిజాలు వెలుగులోకి తేవడానికి అర్జున్ సేది అనే పోలీస్ ఆఫీసర్ని నియమిస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ నిజాలు వెలుగు తీసే క్రమంలో, అతడు ఎదుర్కొనే ట్విస్ట్ లతో స్టోరీ నడుస్తుంది.