తెలుగు టైటాన్స్ రైడర్ భరత్ హుడా నిర్ణయాత్మక మ్యాచ్‌లో సత్తా చాటాడు.
మంగళవారం జరిగిన ఎలిమినేటర్-3లో పట్నా పైరెట్స్‌పై తెలుగు టైటాన్స్ సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 46-39పాయింట్ల తేడాతో పట్నాను చిత్తు చేసింది. టైటాన్స్ జట్టులో భరత్ హుడా(23పాయింట్లు), కెప్టెన్ విజయ్ మాలిక్(5), అజిత్ పవార్(3)రాణించగా.. డిఫెన్స్‌లో అజిత్, అంకిత్, శుభమ్ రాణించారు.
ఇక పట్నా రైడర్ అయాన్(22) ఒంటరి పోరాటానికి తోడు డిఫెండర్ నవ్‌దీప్(5) మాత్రమే రాణించారు. పట్నా కెప్టెన్ అంకిత్ నిరాశపరిచారు. బుధవారం జరిగే క్వాలిఫయర్-2లో ఫైనల్ బెర్త్ కోసం తెలుగు టైటాన్స్ జట్టు పుణేరి పల్టన్స్‌తో తలపడనుంది. శుక్రవారం ఫైనల్ జరగనుంది. దబాంగ్ ఢిల్లీ టై బ్రేకర్‌లో పుణేరి పల్టన్స్‌ను చిత్తుచేసి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.
































