Phone Pe, GPay వాడే వారికి బిగ్ అలెర్ట్.. రేపు ఆ బ్యాంకు UPI సేవలు పని చేయవు

www.mannamweb.com


దేశంలో యూపీఐ పేమెంట్స్‌ రోజు రోజుకు పెరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా, ప్రతి ఒక్కరూ యూపీఐ యాప్స్‌ వాడుతున్నారు. కొన్ని దేశాల్లో సైతం యూపీఐ పేమెంట్స్‌ చెల్లబాటు అవుతున్నాయి. డిజిటల్‌ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చాక జనాలు చాలా వరకు చేతిలో క్యాష్‌ తీసుకెళ్లడం మర్చిపోతున్నారు. స్మార్ట్‌ఫోన్‌, నెట్‌ బ్యాలెన్స్‌ అందుబాటులోకి రావడం.. యూపీఐ చెల్లింపులు పెరగడానికి ప్రధాన కారణం. షాపింగ్‌ మొదలు ఈఎంఐ పేమెంట్స్‌ వరకు యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు.

మరి మీరు కూడా యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంటే.. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. రేపు అనగా.. ఆదివారం, ఆగస్టు 4, 2024 నాడు యూపీఐ పేమెంట్స్‌ పని చేయవు. అయితే అన్ని బ్యాంకులకు సంబంధించి కాదు. కేవలం ఒక బ్యాంక్‌ యూపీఐ సేవలు మాత్రం కొన్ని గంటల పాటటు నిలిచిపోనున్నాయి. ఆ వివరాలు. .

ఆగస్టు 4, 2024న కొందరికి యూపీఐ పేమెంట్స్‌ పని చేయవు. మరి వారు ఎవరంటే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారులు. దీనికి సంబంధించి బ్యాంక్‌ ద్వారా షెడ్యూల్డ్ డౌన్‌టైమ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ వ్యవధిలో, ఏ రకమైన ఆన్‌లైన్ చెల్లింపులు జరగవు.. ఆగిపోతాయి. ఇక బ్యాంక్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఇలా చెప్పుకొచ్చింది.. ‘‘ఈ నెల 4న అనగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు సిస్టమ్ నిర్వహణ పనులు జరుగుతాయి. ఈ సమయంలో అన్ని ఆన్‌లైన్ చెల్లింపులు నిలిపివేయబడతాయి’’ అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అంటే మొత్తం 180 నిమిషాల పాటు యూపీఐ చెల్లింపులు నిలిపివేయబడుతాయి. ఇది ఖాతాదారులందరిపై ప్రభావం చూపుతుంది. ఇందులో సేవింగ్స్, కరెంట్ ఖాతాదారులు లావాదేవీలు చేయలేరు. కనుక వినియోగదారులు దీన్ని గమనించి.. ఆ మేరకు పేమెంట్స్‌ చేసుకోవాలి అని సూచించింది. ఇది అన్ని యూపీఐ పేమెంట్‌ యాప్‌లను ప్రభావితం చేయబోతుంది. బ్యాంక్‌ నోటిఫికేషన్ ప్రకారం, మీరు హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్‌పే, వాట్సాప్‌ పే, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మొబిక్విక్‌లలో చెల్లింపులు చేయలేరు. అంటే ఒక కోణంలో సిస్టమ్ పూర్తిగా డౌన్ అవుతుంది. కానీ పీఓఎస్ సాయంతో చేసే లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని బ్యాంక్‌ తెలిపింది. అత్యవసర లావాదేవీల కోసం దాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.