ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఫార్మర్ రేసు కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం…మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలంది హైకోర్టు. అందరికి రూల్ అఫ్ లా వర్తిస్తుందంది. అయితే హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో ఉన్నారు.