ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
త్రివేణి సంగమం వద్ద భక్తులు అమృత స్నానం చేసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఘాట్ వద్ద బారికేడ్లు విరిగిపడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ మేరకు గాయపడిన 50 మంది క్షతగాత్రులను పారా మిలటరీ దళాలు, వాలంటీర్లు అంబులెన్స్‌లలో సమీపంలోని మహాకుంభ్ నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పుణ్య స్నానానికి భారీ ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందన్న వార్తలపై స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా స్పందించారు. త్రివేణి సంగం రూట్లలో, కొన్ని బారికేడ్లు విరిగిపడటంతో తొక్కిసలాట పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో కొందరికి మాత్రమే గాయాలయ్యాయని ఆమె తెలిపారు. అయితే,�
సీఎం యోగీకి ప్రధాని మోదీ ఫోన్..
మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందనే విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. ఈ మేరకు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. అదేవిధంగా తొక్కినలాట ఘటనపై హోం మంత్రి అమిత్ షా, సీఎం యోగిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి సాయం అందిస్తామని ఆయను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు భరోసానిచ్చారు. అయితే, తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యపై ప్రభుత్వం ఇప్పటి ఎలాంటి ప్రకటన చేయలేదు.