ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బాతురూమ్లో టాయిలెట్ సీటు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఊహించన ఘటనలో 20 ఏళ్ల యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అతడిని హాస్పిటల్కు తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ టాయిలెట్ సీటు ఎందుకు పేలింది?.. అలా బ్లాస్ట్ కావడానికి గల కారణం ఏంటి? అనే విషయానికొస్తే..
టాయిలెట్ సీటు పేలి
20 ఏళ్ల అషు అనే యువకుడు తన ఫ్యామిలీతో కలిసి ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో సెక్టార్ 36లో నివసిస్తున్నాడు. ఇక రోజులాగానే ఉదయం లేచి ఇంట్లో ఉన్న వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్కు వెళ్లాడు. లోపలికి వెళ్లి ముందుగా ఫ్లష్ బటన్ నొక్కాడు. దీంతో ఒక్కసారిగా టాయిలెట్ సీటు భారీ శబ్దంతో బ్లాస్ట్ అయింది. వాష్ రూమ్ మొత్తం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అషు ముఖం, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
పేలుడు శబ్ధం విన్న కుటుంబ సభ్యులు వెంటనే అషును హాస్పిటల్కు తరలించారు. గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్కు అతడిని తీసుకెళ్లారు. అషుకు ఈ ప్రమాదంలో దాదాపు 35 శాతం కాలిన గాయాలు అయినట్లు డాక్టలు తెలిపారు.
ప్రమాదానికి గల కారణం?
ఈ ప్రమాదానికి గల కారణాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. టాయిలెట్లో మొబైల్ యూజ్ చేయడం వల్లనే ఈ పేలుడు సంభవించిందని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం స్థానికంగా ఉన్న మురుగు మూసుకుపోవడంతో టాయిలెట్ బౌల్ లోపల మీథేన్ వాయువు అధికంగా పేరుకుపోయి.. బ్లాస్ట్ జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
































